ఇదీ వాకిలి క్యాలెండర్!

వాకిలి సాహిత్య మాస పత్రిక ప్రతినెలా 1 న మీ ముందు వుంటుంది. మీ రచనలు ప్రతి నెలా 15 వ తేదీకల్లా పంపండి.

నీరెండ మెరుపు

కవిత్వం కేవలం కొన్ని వాక్యాల కూర్పు మాత్రమే కాదు. అదొక అనుభవం! మనలోపల మనకే తెలియని ఒక చీకటి కోణాన్ని వెలిగించే దీపం. ఆ దీపం మీలో ఎలా వెలిగిందో, ఏమేం వెలిగించిందో ఈ శీర్షికలో ఆ వెలుగుని పంచుకోండి. నీరెండ మెరుపు …ఎంచక్కని కవితల పరిచయం. ఈ శీర్షికకు ఎవరయినా రాయవచ్చు. మీ రచనలు ప్రతి నెలా 15 వ తేదీకల్లా ఈ శీర్షికకు పంపించండి.

కొత్త పుస్తకం కబుర్లు

‘కొత్త పుస్తకం కబుర్లు’ శీర్షిక ఏదయినా కొత్త పుస్తకం విడుదల అయిన రోజున ఆ పుస్తకం గురించి క్లుప్తంగా వివరించే శీర్షిక. ఇది కూడా ఆ పుస్తకం విడుదల రోజు గాని, విడుదల అయిన మరునాడు కానీ పోస్ట్ చేస్తాం. ఈ శీర్షికకి ఎవరయినా రాయవచ్చు. కానీ, మీరు మాకు ముందుగా ఆ పుస్తకం విడుదల విషయం ఒక ఈ-లేఖ రూపంలో తెలియజేస్తే దాన్ని పోస్ట్ చేసే ఏర్పాటు చేసుకుంటాం.