‘ ఎన్నారెస్ ’ రచనలు

అంతర్మథనం

సెప్టెంబర్ 2013


ఒక నిండు జీవితం బుగ్గి. వృథా. నలిపేసి ఉండ చుట్టి పారేసిన చిత్తు కాయితం. ఆరు దశాబ్దాల ఆయువు లోని అత్తెసరు వ్యాసంగంతో సాధించావెంత? మల్లీశ్వరిలో భానుమతికి రాణివాసం నచ్చనట్టు నచ్చని ప్రొఫెషన్. ఏవో కొన్ని రాసినందుకే ఎందుకో కొంత తృప్తి! తృప్తి పడ గల మనుషుల తృప్తి పడే గుణం పట్ల యెంత అసంతృప్తి! ఇట్లా కాదు. ఇంకా రాయాలి. డజన్ల కొద్దీ. ఉబుసుపోకకు రాసినవి కావు. పస వున్నవి. పసందైనవి. తాలు కాని గట్టి గింజల్లాంటివి. చిరకాలం గుర్తుండేవి. కానీ యెట్లా రాస్తావు దశాబ్దాల విలువైన కాలం దహనమయ్యాక? పూర్తిగా రూపం దాల్చక అబార్టయిన కవితవు నువ్వు. పూడ్చిపెట్టాలి నిన్ను. మనసును మెలాంకొలీ…
పూర్తిగా »