‘ కృపాకర్ మాదిగ ’ రచనలు

ప్రేమీకి ప్రేమతో…

15-ఫిబ్రవరి-2013


ఉత్తరాల్ని చింపుకుంటుంటానా?
తీయని జ్ఞాపకాల్ని ముక్కలు ముక్కలు చేసుకుంటున్నట్టే వుంటుంది

బహుమతిని తడుముకుంటుంటానా?
నిన్ను నిమురుతున్నట్టే వుంటుంది

చిప్పిరి మొలిచిన ఆ స్థలాన్ని చూస్తుంటానా?
మన సమావేశం ముగియనట్టే వుంటుంది

ఒక బిందువు వద్ద మొదలై నువ్వటూ నేనిటూ బయల్దేర్తామా?
వృత్తంలో ఎక్కడో మళ్ళీ మనం కల్సుకుంటున్నట్టే వుంటుంది

ఎవరికి వాళ్ళం తలపులన్నీ కలబోసుకుంటుంటామా?
మనకిష్టమైన చిత్రమేదో రూపుదిద్దుకుంటున్నట్టే వుంటుంది

మరో ప్రపంచాన్ని గానం చేస్తుంటామా?
ఆ ప్రపంచపు విజయోత్సవ వేడుకల్లో
మనం ఆలింగనం చేసుకుంటున్నట్టే వుంటుంది


పూర్తిగా »