‘ కె. శ్రీనివాస్ ’ రచనలు

సమాజాభివృద్ధి కోసమే భాషాభివృద్ధి

సమాజాభివృద్ధి కోసమే భాషాభివృద్ధి

తెలుగు భాషకు ప్రమాదం ఏర్పడిందని బాధపడేవారు మునుపటికంటే ఇప్పుడు బాగా పెరిగిపోయారు. ఒక వేళ ప్రమాదం ఉన్నదనుకుంటే, ఆ ప్రమాదానికి కారణమవుతున్నవారు, దాన్ని పెంచి, పోషిస్తున్న వారు కూడా ఇప్పుడు బాధపడే వరసలోకి చేరిపోయారు. అందరూ కలసి గుండెలు బాదుకోవడం తప్ప, భాషను కాపాడుకోవడానికి చేయవలసిన పనులు మాత్రం చేయడం లేదు.

ఇంతకూ తెలుగుకు ముంచుకువస్తున్న ముప్పు ఏమిటి? ఈ ప్రశ్నకు భాషాభిమానులందరి దగ్గరా సమాధానం దొరుకుతుందని చెప్పలేము. చాలా మంది దృష్టిలో, మన వాడకంలో ఇంగ్లీషు పదాలు ఎక్కువగా దొర్లుతుండడం ఒక పెద్ద ప్రమాదం.ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీషులో మాట్లాడుకుంటారని మన మీద మనం వేసుకునే ఇష్టమైన ఛలోక్తి. దుకాణాల బోర్డులు తెలుగులో…
పూర్తిగా »