‘ కొల్లూరి సోమ శంకర్ ’ రచనలు

వ్యవస్థలోని అవకతవకలని ప్రశ్నించిన “చాగంటి సోమయాజులు కథలు”

వ్యవస్థలోని అవకతవకలని ప్రశ్నించిన “చాగంటి సోమయాజులు కథలు”

ఈ వ్యాసంలో పరిచయం చేస్తున్న పుస్తకం అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా వారు ప్రచురించిన "చాగంటి సోమయాజులు కథలు". చాసోగా ప్రసిద్ధులైన శ్రీ చాగంటి సోమయాజులు విశిష్ట కథకులు. వాసి కన్నా రాశి మీద దృష్టి నిలిపిన రచయిత. వస్తువు, సన్నివేశం, పాత్రల ప్రవర్తన, సంభాషణలు అన్నిటిలోనూ ఆయన చింతనా, దృక్పథం అంతర్లీనంగా వ్యక్తమవుతాయి. ధనస్వామ్యంలో ధనం ఏ విధంగా మనుషుల్ని అవినీతిపరుల్ని చేస్తుందో, మానవత్వాన్ని ఎలా నాశనం చేస్తుందో, బూర్జువా సమాజంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో సునిశితంగా పరిశీలించి పాత్రల సృష్టి చేశారు చాసో.
పూర్తిగా »

మసకబారిన జ్ఞాపకాలు

మసకబారిన జ్ఞాపకాలు

పదేళ్ళ వయసున్న మా అబ్బాయిని తీసుకుని రామాపురం బస్టాండులో బస్సు దిగేసరికి నేను ఆశ్చర్యపోవాల్సివచ్చింది. ఇరవై ఏళ్ళ తర్వాత రామాపురం వస్తున్నాను. కొన్ని మార్పులుంటాయనుకున్నాను కాని ఈ స్థాయిలో ఉంటాయని మాత్రం ఊహించలేదు. నేను చివరిసారి చూసినప్పుడు ఈ బస్టాండు పొలాల మధ్య మట్టి రోడ్డుతో ఒకే ఒక షెల్టర్‌తో ఉండేది. ఇప్పుడు.. ఇటుకలు, సిమెంటుతో నిర్మించిన విశామైన భవనాల మధ్య ఠీవిగా ఉంది. బైకులు, కార్లు, జీపులు, బస్సుల వంటి వాహనాల రణగొణ ధ్వనులతో వాతావరణం గందరగోళంగా ఉంది. నా చిన్నతనంలో చదువుకునే రోజులు నాకు బాగా గుర్తున్నాయి. అప్పట్లో రోడ్డు మీద చాలా తక్కువ వాహనాలు ఉండేవి. ప్రభుత్వం…
పూర్తిగా »

పలక కావాలి

పలక కావాలి

కవిత తమ డాబా మీద కూర్చుని గచ్చు మీద చాక్‌పీసులతో ఏదేదో గీస్తోంది. బడిలో వాడి పాడేసిన చాక్‌పీస్‌లను ఏరుకుని జాగ్రత్తగా రుమాలులో చుట్టుకుని ఇంటికి తెచ్చుకుంటుంది కవిత. రెండు పిలకలున్న ఓ పాప బొమ్మ గీయడం ఇప్పుడే పూర్తి చేసింది. ఈ బొమ్మ తల మీద కూడా, సగటు భారతీయ విద్యార్థుల బుర్రల్లో తిరిగే అంకెలు, అక్షరాలు గుండ్రంగా తిరుగుతున్నాయి.

మావయ్య తమ ఇంటికి రావడం ఉన్నట్లుండి గమనించింది కవిత. చప్పట్లు కొడుతూ, గెంతడం ప్రారంభించింది. కవితా వాళ్ళదీ, మావయ్యదీ ఒకే ప్రహరీ గోడలో ఉండే రెండు వేర్వేరు ఇళ్ళు. కవితకీ, అక్కలకీ మావయ్య శాంతాక్లాజ్ వంటివాడు. ఎప్పుడూ ఏవో బహుమతులు, ఊహించని కానుకలు…
పూర్తిగా »

తెలుగులో అస్తిత్వవాద కథలు ఎక్కువ. – సోమ శంకర్

తెలుగులో అస్తిత్వవాద కథలు ఎక్కువ. – సోమ శంకర్

అనువాదం చేయడమంటే చేతిలో కర్రకు బదులు మూల కథను ఒకచేతిలో అనువాద కథను మరో చేతిలో పట్టుకుని తీగమీద నడవడం. విభిన్న శైలులతో ఉండే కధలను ఆయా మూలకథల ఆత్మ ఏమాత్రం ధ్వంసం కాకుండా తెలుగు భాషలోకి అనువదించటం నిజంగా కత్తిమీద నడవడం లాంటిదే! అలాంటి అనువాదాలు ఒక్కటి కాదు రెండు కాదు.. పూర్తిగా నూరు కథలను తెలుగులోకి అనువదించిన కొల్లూరి సోమ శంకర్ గారికి అభినందనలు తెలియజేస్తూ వాకిలి ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ:

1. సోమ శంకర్ గారు, ముందుగా మీకు వంద కథల అనువాదం పూర్తయిన సందర్భంగా అభినందనలు!

థాంక్యూ. నమస్కారం. ముందుగా, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు, నా వందో అనువాద కథను…
పూర్తిగా »