‘ చింతలచెరువు సువర్చల ’ రచనలు

పాత ఒక వింత!

పాత ఒక వింత!

మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం లో ఉమెన్స్ హెల్త్ అండ్ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ పై అధ్యయనం చేసి ఇండియాకొచ్చి దీనిపై పరిశోధనలు జరిపిన జోలీ ఈ మధ్యే ఓ జిం ఏర్పాటుచేసింది. దేశరాజధాని న్యూఢిల్లిలో ఆ జిం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఎందరో శ్రీమంతుల స్త్రీలకు, అందునా సీమంతం చేసుకోబోయే ఇంతులకు కూడా ప్రత్యేక వ్యాయామాలున్నాయి. ప్రతి వ్యాయామమూ నిజానికి వ్యాయామం కాదు. ఓ పని! ఆ పనిలో ఉండే వ్యాయామాల వల్ల మన ఆరోగ్యం ఎలా బాగుపడుతుండో ఇక్కడ తెలుసుకోవచ్చు. అంతేకాదు శారీరిక చైతన్యంతోబాటు మానసిక ఒత్తిడుల్నుంచికూడా ఉపశమనం దొరుకుతుందట.

ఒక పని గుండెపోటుని రానీకుండా చేస్తుందట. మరోపని పొత్తికడుపు పెరగనీయకుండా, ఇంకోటి…
పూర్తిగా »

మమతలు కావాలి

మమతలు కావాలి

“శ్రామిక విప్లవం మనుషుల మధ్య పెరిగిన దూరానికి నాందీవాక్యం పలికింది. అలాంటప్పుడు మనుషుల్ని మనుషులకు కానీకుండా చేసే విప్లవాలు ఎందుకు? చైతన్యంతో బాటు మమతలు పెంచే విప్లవాలు కావాలిగాని!” అంటూ తను రాయబోయే విషయానికి తొలిపలుకులు రాసుకున్నాడు “కిట్టూ” అని పిలువబడే కృష్ణమూర్తి.

***

పరిగెత్తుకుంటూ ఇంట్లోకొచ్చిన కిట్టూని చూసి
‘వచ్చాడా?’ అడిగాడు నాన్న. రాలేదన్నట్లు తలూపాడు కిట్టు.
‘రాలేదా!?’ అన్నాడు పెద్ద బాబాయి
‘రావాలే!’ అన్నాడు చిన్న బాబాయి
‘వస్తాడ్లే..’ తాపీగా అన్నాడు తాతయ్య

‘అయితే వచ్చే ఉంటాడా?’ నాన్న
‘వస్తే ఇంతాలస్యమా?’ విసుగ్గా పెద్ద బాబాయి
‘వస్తూ ఉన్నాడేమో!’ చిన్న బాబాయిపూర్తిగా »

పాలగుండెలో ఏదీ దాగుందో..!!

చిన్నప్పటి రోజులు చాలా అందంగా వుంటాయని..మళ్లీ అవి వచ్చేస్తే ఎంత బాగుండు!! అని మనం చాలాసార్లు అనుకొంటుంటాం. ఒక్కోమారు,అలా అనుకోవటం నాకెందుకో నచ్చదు. అలాగని ఆ రోజుల్నిప్రేమించొద్దని,వాటికి విలువలేదనీ నేననను. ప్రస్తుతావస్థని ప్రేమించలేనివారు గతాన్ని ఏం ప్రేమిస్తారని నా వాదన! ఎప్పుడూ జరిగిపోయినవే మనకు అపూర్వంగా తోయటం, వర్తమానాన్ని యాంత్రికంగా భావించటం!! ఆలోచనలను జరిగిపోయిన విషయాలపైనే సంధించి, వాటిని మధురక్షణాలుగా భావించి(నిజానికి వాటిని ఆ సమయం లో ఎంతో నిర్లిప్తంగా అనుభవించి వుంటాం!) ..నేటి జీవితాన్ని ఆనందించక పోవటం మనం చేస్తున్న పని! ఈ విషయాన్ని తెలుసుకోటానికి కొంతమందికి ఓ జీవితకాలం పడుతుందనుకుంటా! అందులో నేనూ ఒకర్ననిపిస్తోంది. అందుకే మీకిప్పుడు నా కబుర్లు చెప్పాలనిపించింది.

పూర్తిగా »