‘ చిత్రకొండ గంగాధర్ ’ రచనలు

అవతలకి తోస్తోన్న గాలి

ఇష్టమే లేని స్థలంలో ఎందుకుంటావు
కొమ్మలు లేని చెట్టుని చూశావా
అక్కడే గాలీ లేదు

ఇష్టం లేని కాలంలో ఏ చెట్టైనా ఎందుకుంటుంది

అంతర్లోకంలో వీచే ఏ గాలో
చేతుల్ని నరుక్కుని తీసుకుపోతే

నీటి అడుగున
నా పేరును నేను బలంగా పట్టుకుంటే

నా కాళ్ళకు నచ్చి
నిప్పు అదుముకుంటే

వంతెన దాటేస్తాను
పూలని కాల్చుకుంటూ


పూర్తిగా »