తెలంగాణ అస్తిత్వానికీ, దళిత అస్తిత్వానికీ నిలువెత్తు కవితా రూపం జూపాక సుభద్ర. ఈ రెండు అస్తిత్వాలకు తన స్త్రీ అస్తిత్వం కూడా తోడయ్యి ఆధునిక తెలుగు కవిత్వంలో ఒక వినూతనమైన, విలక్షణమైన సొంత గొంతుకగా సుభద్ర మార్మోగుతున్నది. పైటను తగలెయ్యాలన్న ఆధునిక అర్బన్ స్త్రీవాదానికి ప్రత్యామ్నాయంగా దళిత శ్రామిక స్త్రీవాద దృక్పథాన్ని తెలంగాణ గొంతుతో వినిపించింది సుభద్ర . 1989-95 ల మధ్య వామపక్ష ఉద్యమాలలో చురుకుగా పనిచేసిన సుభద్ర తనదైన అస్తిత్వాలని కనుక్కున్నది. నిజానికి ఇవాళ్ళ తెలంగాణ, దళిత, స్త్రీవాద అస్తిత్వాలతో రాస్తున్న సుభద్ర లాంటి కవులు, రచయితల ఆవిర్భావం వెనుక 90 వ దశకం మలిభాగంలో మారోజు వీరన్న కృషి ఎంతో ఉన్నది.…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్