‘ డా. పేరం ఇందిరా దేవి ’ రచనలు

మొగలిపొద

మొగలిపొద

“జిస్ గలీమే తెరా ఘర్ న హో బాలమా ఉస్ గలి సే హమే తో గుజరానా నహి,” సెల్ లో వస్తున్నముకేష్ పాటతో పాటు తాతయ్య కూనిరాగం తీసుకుంటూ తోటలో కలుపు మొక్కలు తీస్తున్నాడు. క్యాట్ మోడల్ పరీక్ష రాసి, కాస్త చిరాగ్గా వున్నఅర్నవ్ బండి పెట్టేసి నేరుగా తాతయ్య దగ్గరకు వెళ్ళాడు.

“ఎలా రాశావు కన్నా.. ?” తాతయ్య అడిగాడు.

“బాగా రాశా తాతయ్యా ఈ పాట అర్థం ఏమిటి? మీరు ఎక్కువ వింటుంటారు . ”

” ఏ వీధిలో అయితే నీకు ఇల్లు లేదో ఆ వీధిలో నేను ప్రవేశించను,నీ ఇంటికి చేర్చని దారిలో నేను నా పాదం మోపను”


పూర్తిగా »

స్త్రీ

స్త్రీ

కొద్ది కాలం క్రిందట మేము అమ్మమ్మ గారి వూరికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది. మా తాతగారితో పిల్లలందరికీ బాగా చనువు, నేను ఆయనకు మొదటి మనుమరాల్నికావడంతో నన్ను బాగా ముద్దు చేసేవారు. సమయం దొరికితే చాలు ఆయన్ని కథలు చెప్పమని వేధించేవాళ్ళం. చాలా చిన్నప్పుడు పేదరాసి పెద్దమ్మ కథలు; తర్వాత సింద్ బాద్, ఆలీబాబా కథలు, చరిత్రలోని గొప్పవాళ్ళ గురించి చెప్పేవారు.వాళ్ళ జీవిత చరిత్రలు చదివి మాకు వినిపించేవారు. సెలవుల్లో మేము,మా చిన్నమ్మ,మామయ్యల పిల్లలు అందరం కలిసి మెలిసి, ఆటలు, పాటలు, అల్లర్ల తో గడిపే వాళ్లము.తాతయ్య చాలా పనిలో తలమునకలై వుండేవారు. మూడు ఊర్లకు ప్రెసిడెంట్ గా ఎప్పుడూ వచ్చేపోయే జనాలతో తాతయ్య…
పూర్తిగా »