‘ నీరుకొండ అనూష ’ రచనలు

ఒక ప్రయాణం..

మార్చి 2014


ఒక ప్రయాణం..

ఈరోజు చాలా ఆనందంగా ఉంది.. నా బాధ్యతను నేను సరిగా నిర్వహించానన్న ఆనందమో.. లేక నేను గెలిచానన్న గర్వమో అర్థం కాలేదు.. సెలవు పూర్తయ్యాక ఆఫీసుకు ఇదే మొదటిరోజు.. బస్సు ఎక్కాను.. మనసు ఏదో పాత జ్ఞాపకాలను తోడుతూ ఉంది…

జీవితమే ఒక ప్రయాణం.. ఈ మాట చాలాసార్లు వినుంటాం. కానీ ప్రయాణమే ఒక్కోసారి జీవితాన్ని రుచి చూపిస్తుంది. మన జీవిత కాలంలో ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం.  అక్కడ ఎందరో పరిచయమూ అవుతారు.  కానీ అందరూ గుర్తుండరు. కొందరే ఎప్పటికీ గుర్తుండిపోతారు…! అందుకు పెద్ద సంఘటనలే అవసరమవకపోవచ్చు.. వాళ్లు చెప్పే ఒక మాట మనసును తాకడమో.. ఆలోచన రేకెత్తించడమో చేస్తాయి.. అవే వారిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా…
పూర్తిగా »