‘ పద్మా శ్రీరాం ’ రచనలు

తలపుల తురాయి

నిన్నటి అసంతృప్త నీడలు
నా అక్షరాలనలుముకుంటున్నాయ్
రేపటి నీ చూపు వెలుగులో
సాహిత్యాన్ని మధిస్తూ….నేను
ఏంటో నువ్వెళ్ళిపోయావ్
నిశ్శబ్దాన్ని నాలో రగిల్చి
నీ తలపులు మిగిల్చిన
విషాదం మాత్రం నాతోనే…
మది సెగలో ఆరేస్తున్నా
వెల్లువౌతున్న మమతల జడిలో
నిలువెల్లా తడిసిపోతున్న
నీ జ్ఞాపకాల పరిమళాలన్నీ
నీ అనుబంధపు మర్రిచెట్టు
నిలువెల్లా నాలో విస్తరిస్తూ
చూడు గొణుక్కుంటూనే ఉంది
కాలపు గాలికి రాలిన విషాదపు ఆకు
సెలయేటిలో వెన్నెల దారి
బాటసారులెవరూ లేరు
పెక్కు నువ్వు లను వెతుకుతున్న

పూర్తిగా »