‘ పి. వసంత లక్ష్మి ’ రచనలు

అర్ధం కాని వింత కథ ..

ఏప్రిల్ 2014


అర్ధం కాని వింత కథ ..

“ఆవ పెట్టిన ఆనపకాయ కూర, దోసకాయ పప్పు , పులుసు పెట్టమని చెప్పి వచ్చాను ” వెళ్ళాలి  అంటూ లొట్టలేసుకుంటూ భోజనానికి బయలుదేరాడు మూర్తి. లంచ్  టైమ్  కావడంతో నాకూ ఆకలి దంచేస్తున్నా ఈ ఒక్క స్టేట్మెంట్ చదివి  వెళదాం అని కూర్చున్నాను కుర్చీ కి అతుక్కుని మరీనూ.

అయినా  ఈ మూర్తి ఏమిటీ ? రోజూ ఫలానా వంట చేయమని చెప్పి వచ్చాను అంటాడు,  అదేమిటి ? తనకి తోచినదేదో వండే స్వాతంత్ర్యం కూడా మూర్తి భార్య కి లేదా ఏమిటి ?

నాకు అన్నీ వింత గానే తోస్తాయి.

రోజుకి ఒక ఆపిల్ తింటే వైద్యుని కి దూరం గా ఉండ వచ్చు…
పూర్తిగా »