‘ బూర్ల వెంకటేశ్వర్లు ’ రచనలు

పక్షుల భాష

పక్షులు మాట్లాడుతున్నప్పుడు
గాలిలో ఎగురుతున్నట్టు
ఒంటి కాలి మీద తపస్సు చేస్తున్నట్టు
నీళ్ళల్లో ముక్కు పెట్టినట్టు
చేపను ముక్కున పట్టుకున్నట్టు
నీకు కనిపిస్తుంది
దృశ్యం అదృశ్యంగా సంభాషిస్తుంది

సముద్రపు లోతును గూర్చి
లోపలి సుడిగుండాల గూర్చి
బడబానలాల వ్యాప్తిని గూర్చి
తుఫాను కేంద్రకం గూర్చి
నీకు వినిపిస్తుంది
శబ్దం నిశ్శబ్దాన్ని చెవిలో ఊదిపోతుంది

అడవుల పచ్చదనమైనా
పచ్చటి ఆకులు రాలడమైనా
మోదుగు చెట్లు తగలబడడమైనా
పొగ సంకేతం కావడమైనా
నీకు తెలుస్తుంది
జ్ఞానం తెలియని జ్ఞానాన్ని దాటిపోతుంది

***

పక్షులు ఎగరడం వినోదం…
పూర్తిగా »