‘ భవానీ ఫణి ’ రచనలు

అద్దం

ఏప్రిల్ 2014


అద్దం

“అక్కా..నీళ్లోసుకున్నానే !!” చెల్లెలు, తను అంట్లు తోమే బామ్మగారింటికి ఫోన్ చేసి చెప్పిన మాటకి సావిత్రి ఎంతో సంబరపడిపోయింది. షావుకారు కొట్టుకి వెళ్లి ఇన్ని సగ్గుబియ్యం, కాస్త పంచదార తెచ్చి కొంచెం పాయసం చేసి మొగుడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.

తమ్ముడు పుట్టిన కొద్ది రోజులకే సావిత్రి తల్లి అదేదో నోరు తిరగని పేరున్న రోగం తో చచ్చిపోయింది . మందులు కూడా కొనలేని తమ బీదతనం వల్ల తల్లి చివర్రోజుల్లో నరకాన్ని అనుభవించడం సావిత్రి కి తెలుసు. తల్లి పోయిన రెండు నెలలకే బాగా తాగేసి తిరుగుతున్న తండ్రి ని లారీ గుద్దేసింది. అప్పట్నుంచి తాము ముగ్గురు అక్కడా ఇక్కడా ఉంటూ పాచి…
పూర్తిగా »

కావడి కుండలు

మార్చి 2014


జననం మరణానికీ
మరణం మళ్ళీ జననానికీ
కారణం అయినట్లు

ఆకాశాన్ని అందుకున్న
సముద్రపు నీరు,మేఘాల్లోంచి దూకి
మళ్ళీ నడిసంద్రం లోకి జారినట్టు

గమనం నిశ్చలమై నిలిచి
ఆ స్థిరత్వం మళ్ళీ చలనమవుతూ
నిలకడని నడక పూరించినట్టు

మిగలముగ్గి నేలరాలిన ఓ పండు
చిరు మొక్కగా ప్రాణం పోసుకుని
మరెన్నో పళ్ళకి సృష్టికర్త అయినట్టు

అలిగి దూరమై ,అంతలో చేరువై
సూర్యుడి చుట్టూ భూమి
పదే పదే ప్రదక్షిణలు చేసినట్టు

నిశిరాత్రిలోకి నిష్క్రమించిన వెలుగు
వేకువై వికసించి మళ్ళీ చీకటి వైపుకి
పయనం ప్రారంభించినట్టు

ఆకుపచ్చని వసంతగానం
నిశ్శబ్దంగా…
పూర్తిగా »