‘ మధురాంతకం నరేంద్ర ’ రచనలు

గమనాన్ని గమనించే కథలు

గమనాన్ని గమనించే కథలు

తెలుగు వాళ్ల కిప్పుడు రెండు రాష్ట్రాలు యేర్పడ్డాయి. కానీ ఈ రెండు రాష్ట్రాల్లోని తెలుగువాళ్ల సంఖ్య యెంతో, అంతమంది తెలుగువాళ్లు రెండు రాష్ట్రాల బయట వున్నారు. తొలిరోజుల్లో చాలా చిన్న గొంతుగా ప్రారంభమైన వాళ్ల సాహితీస్వరం క్రమంగా పెరిగి 2000 నాటికి స్పష్టంగా వినబడసాగింది. తమిళనాడులో హోసూరు నుంచి తెలుగు సాహిత్యం వెలువడడం ప్రారంభించాక గానీ, అక్కడి తెలుగువాళ్ల వునికీ, మనికీ, యితరులకు తెలియలేదు. యిప్పుడు రాష్ట్రేతర ఆంధ్రులు తమదైన జీవితాన్ని సాహిత్యీకరించే పనిని నిర్దుష్టంగా చేసుకుపోతున్నారు. సమకాలీన సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ బలంగా వున్న కథానిక వాళ్ల వ్యక్తీకరణకు బాగా దోహదం చేస్తోంది. గత అయిదారేళ్లుగా అమెరికాలో స్థిరపడిన తెలుగువాళ్లు రాస్తున్న కథలు తెలుగు…
పూర్తిగా »

విపర్యాయం

విపర్యాయం

ప్రవాహంలో కొట్టుకుపోవడమే సుఖంగా వున్నప్పుడు
ఆగి తిరిగి చూడాలనుకోవడమెందుకు?
కెరటాలు వెనుదిరగనివ్వకుండా తోసుకెల్తున్నప్పుడు
చూపుల్ని మరల్చే ధ్యాసెందుకు?
మోసుకెళ్తున్న ప్రవాహానికి అంకితమవకుండా
నీడల్ని సారించే మేఘాలపైన మోజెందుకు?
కూలుతున్న యిసుక గట్టుపైన నిలబడి
నీటి వాలును హెచ్చరించాలన్న పిచ్చి కోరిక పుట్టేదెందుకు?

పవలించిన కొండచరియల పక్కన
స్వప్నమొక్కటి పరిమళిస్తోంది
స్వప్నపుష్ప పరాగంలో
వివిశత్వమొకటి శృతి కలుపుతోంది
స్వప్నవివిశత్వ వీవనలో కిరణమొకటి పదునెక్కుతోంది.

బుతుగుర్రానికి
రౌతై పర్వతాగ్రం చేరింది దీప్తి
స్వాతిశయ స్వాతంత్రం కోసం లోయలోకి జారింది తమస్సు
ముత్యపు చిప్ప కరగడంత్లో ప్రవాహంలో కలిసిపోయిందో బిందువుపూర్తిగా »

మారే క్షణాలతో మారే యుద్ధమే రచన!

మారే క్షణాలతో మారే యుద్ధమే రచన!

నీరు పల్లమెరుగు,నిజము దేవుడెరుగు-అన్నది సామెత. మానవ జీవన మనే ప్రవాహం ఏ గతిలో సాగుతున్నదో  తెలుసుకోవాలనుకుంటాడు రచయిత. ప్రవాహదశలోని ఒక దశను -ఒక చిన్న మార్పును -ఆ మార్పు చెందుతున్న క్షణాన్ని తన రచన ద్వారా పట్టుకోడానికి పోరాటం చేస్తాడు. రచయితగా తనకుండే సాహిత్య సాధనాల్తో మార్పు చెందుతున్న క్ష ణాన్ని  సాహసంతో పట్టుకుంటాడు.

అయితే ఈపని జరుగుతున్న స్వల్పకాలంలోనే మానవ జీవితవాహిని మలుపుకు తిరిగేసి , మరో దిశకు మారి, ఇప్పుడేమంటావంటూ రచయితను సవాలు చేస్తుంది.మళ్ళీ రచయిత అప్పుడు తయారైన మార్పును అర్థం చెసుకునే పనికి సమాయత్తం అవుతాడు.ఇలా సాహిత్యానికీ,మానవజీవితానికీ మధ్యలో నిరంతరంగా జరుగుతున్న ఈ పోటీలో , వ్యక్తిగా జీవితపరిణామాలకు మారుతూ, రచయితగా…
పూర్తిగా »