‘ మురళీధర్ నామాల ’ రచనలు

యామిని

డిసెంబర్ 2013


యామిని

ఆకాశం కాస్త మబ్బుపట్టి మిట్ట మధ్యాహ్నమే సాయంత్రంలా అనిపిస్తోంది. చల్లగాలి వీస్తూ ఉండటంతో వాతావరణం తేలిగ్గా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఆ రోజు ఇంటిలోనే ఉన్నాను. నేను పని చేసుకుంటూ ఉండటంతో నా భార్య మధు పక్క ఫ్లాట్‌లో ఉన్న తన ఫ్రెండ్స్‌తో మాట్లాడటానికి వెళ్ళింది. లాప్‌టాప్ పక్కనపెట్టి కిటికీలో నుండి బయట మెల్లగా కదులుతున్న చెట్లను, ఆ చలికి వణుకుతున్న పక్షులనూ చూస్తూ నిలుచున్నా. ఇంతలో నా సెల్ మ్రోగింది.

“సార్ కూకట్‌పల్లిలో 2 బి.హెచ్.కె. అడిగారు. మీరే కదా.”

“అవును. మీరు శ్రీనివాస్ గారా?”

“అవునండీ. కె.పి.హెచ్.బి.లో ఒక అపార్ట్‌మెంట్ ఉంది. ఫుల్లీ ఫర్నిష్డ్, రెడీ టూ ఆక్యుపై. నేను…
పూర్తిగా »