‘ యం.యస్.కె. కృష్ణజ్యోతి ’ రచనలు

దొరబాబు

పాపం చెన్నమ్మ.. వయసులోనే మొగుడు పోయి, ఇప్పుడు వయసే అయిపోయి, ఆటో యాక్సేంట్లో చెయ్యి తెగిపోయి, ఒంటిపైని ముడతలు పడిపోయి ఇట్టా వుండాదిగానీ దొరబాబు పెళ్ళాం కాక ముందర, పాతూరు పాలెంలో చానామంది కన్నా మా గొప్పగా బతికినట్టే!. చిన్నప్పుడు చెన్నమ్మ తల్లి రవనమ్మ, పిల్లకి బుగ్గమీదా, ముక్కుమీదా, అరికాలినా దిష్టి చుక్కలు పెట్టేది.

“నాకూతురు సందమామ. దీనికి కురిచీలో కాలు మీద కాలేసుకుని కూచునే దొరబాబు లాటి మొగుడోస్తాడు”పతిరోజూ ఇట్నే అనేది. చెన్నమ్మ కిల కిలా నవ్వేది. రోజూ అమ్మ గారాబం చేసి మోచ్చుకోటాన తను నిజంగా చాలా అందగత్తె అని చెన్నమ్మకి తెలిసిపోయ్యింది. అందుకే ఆటల్లగూడా యువరాణీ ఏషాలే గట్టేది. చుట్టు పక్కల…
పూర్తిగా »