‘ రాధిక ’ రచనలు

ఉలవచారు రత్నం సారు

ఏప్రిల్ 2017


ఉలవచారు రత్నం సారు

“ఏ బ్రాంచ్ అమ్మా మనది?”

“ఎలెక్ట్రికల్ అండ్ ఎలెక్ట్రానిక్స్ ఇంజినీరింగ్  సా”    చెప్పాను.

“ఏది.. దాన్ని సింప్లిఫై చేసి చెప్పు”.

“ఈ ఈ ఈ సా”

“ఆపకుండా మూడు సార్లు చెప్పు”

“ఈ ఈ ఈ  ఈ ఈ ఈ  ఈ ఈ ఈ ”

“ఎందుకు పాపా ఏడుస్తున్నావు. చీమ కుట్టిందా”

అప్పటి దాకా బిక్కు బిక్కు మంటున్న నాకు భలే నవ్వు వచ్చింది. యాడో ఒంగోలు దగ్గర వున్న ఒక చిన్న పల్లెటూరు నుంచి ఇంత పెద్ద విశాఖపట్నంకి ఇంజనీరింగు చదవటానికి వచ్చా. రాగింగ్ అని ఒకటుంటుందని ఆడా ఈడా అనుకుంటుంటే విన్నా. సీనియర్లు ఏమడిగినా చెప్పాలని, సీనియర్లని సార్ అనాలని…
పూర్తిగా »