‘ రామక్రిష్ణ నిమ్మగడ్డ ’ రచనలు

అమెరికాకు దారేది…

అత్తారింటికి దూరంగా
పరుగెత్తి వస్తారొకరు
విత్తం వేటలో
మొత్తం వదిలి వస్తారొకరు

విద్యయందు అనురక్తులై
ఉన్న ఊరిని కాదని వస్తారొకరు
అందరిలో చెప్పుకునేందుకు
అమ్మ, నాన్న పంపితే వస్తారొకరు

అమీర్ పేట గాలియో
హై టెక్ సిటీ మహిమయో
అవినీతి పై అసహనమో
నిరుద్యోగపు నిరాశయో

దారి ఏదైనా అన్ని దారులూ
అమెరికాకే, వీసా ఏదైనా,
వలసకొచ్చి వాలాము ఇచట
బంగారు కలలకై ఉంటాము ఇచట

కలత చెందినపుడు కవిత
లల్లుకొని కాలం గడిపేస్తాం
కన్నభూమిపై ప్రేమను
కాస్తయినా పంచుకొంటాం!


పూర్తిగా »