‘ వరవర రావు ’ రచనలు

కవిత్వం కావాలి

15-ఫిబ్రవరి-2013


కవిత్వం కావాలి

కవిత్వం రాస్తూనే వున్నాం

కన్నీళ్ళ కవిత్వం కలల కవిత్వం కల్లబొల్లి కవిత్వం
జ్నాపకాల కవిత్వం వ్యాపకాల కవిత్వం
ఆశల కవిత్వం అడియాసల కవిత్వం
అనుభూతుల ఆశయాల కవిత్వం

విత్తనం వున్న కవిత్వం కావాలి
విస్ఫోటనం చెంది వికసించి
పుష్పించి పరిమళించి
ఫలించే కవిత్వం

వెన్నెముక వున్న కవిత్వం కావాలి
నిటారుగా నిలబడి వ్యవస్థను నిలదీసే కవిత్వం
ఆధిపత్యాన్ని ప్రశ్నించే కవిత్వం
రాజ్యాన్ని ధిక్కరించే కవిత్వం

చూపు వున్న కవిత్వం
లోచూపు వున్న కవిత్వం
ముందు చూపున్న కవిత్వం

శిశువు చిరునవ్వు వంటి కవిత్వం
ప్రేమతో వివశమయిన కవిత్వం

పూర్తిగా »