కడిమిచెట్టు

కల్లోలానికి ఆవల – అరవింద గారి ‘అవతలి గట్టు’

కల్లోలానికి ఆవల – అరవింద గారి ‘అవతలి గట్టు’

సాహిత్యం కొన్ని ప్రశ్నలకి సమాధానం, ఇంకొన్ని ప్రశ్నలకి జన్మస్థానం. ఆ పుట్టినవాటికి జవాబులు ఆ పుస్తకంలోనే దొరకక పోవచ్చు, ఎక్కడ, ఎలాగ దొరుకుతాయో ఆ వెతుకులాటని మొదలుపెట్టించటమూ సాహిత్యపు ఒక సల్లక్షణం.

ఈ కథని రెండు విధాలుగా అర్థం, అపార్థం చేసుకోవచ్చు. ఒకటి స్త్రీవాదపరంగా, మరొకటి నైతికనిబంధనల పరంగా. ఈ రెండింటినీ కలిపినా సరిపోదు , అది మనిషితనం తోనే సాధ్యం. వ్యక్తి వ్యక్తికీ మారే స్వభావమూ అది మారటం కష్టమని తెలుసుకోవటమూ , అపరాధాలు జరగటమూ వాటిని అర్థం చేసుకోగలగటమూ ఇదంతా నేర్పుతుంది ఈ నవల. యుద్ధంలో సర్వతోభద్రవ్యూహం ఏదీ ఉండదు, కాని ఎడాపెడా తగలగల దెబ్బలని కళ్లు తెరిచి కాచుకోవటం ఒక…
పూర్తిగా »