సెటైర్

నలుపు – తెలుపు

నలుపు – తెలుపు


రాత్రి తొమ్మిదిన్నరకి రోజువారీ కేబినెట్ మీటింగ్ పూర్తయ్యింది. కేబినెట్లో తన పరిపాలన పద్ధతులు మార్చుకోవాలని వత్తిడి పెట్టే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఏక కంఠంతో, అందరూ తన వాగ్ధాటి తగ్గించమని ఉచిత సలహా ఇవ్వడం మొదలెట్టారు. ముఖ్యంగా, టెలివిజన్లోమాట్లాడినప్పుడు, విలేకరుల గోష్టి లోనూ, వివాదాస్పదంగా కనిపించకండా ప్రతిపక్ష వర్గం నాయకుల ఆదర్శాలకి – వాళ్ళకోరికలకీ-అన్నింటికీ కాకపోయినా కొన్నింటికయినా — ఒకింత సుముఖత చూపించడం, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి తనకి, తన వర్గం వారికీ, తన ప్రభుత్వానికీ ఏవిధమయిన అభ్యంతరం లేదని సూచన ప్రాయంగా చెప్పడం అవసరమని కేబినెట్లో పెద్దతలకాయల అభిప్రాయం. బహిరంగంగా మాట్లాడేటప్పుడు, మైనారిటీ వర్గాలనీ, పేదవారిని వెనకేసుకు రావటం తప్పుకాదు…
పూర్తిగా »