యెల్లో రిబ్బన్…

ఇట్లు మీ… (2)

ఫిబ్రవరి 2015


ఇట్లు మీ… (2)

ఆల్చిప్పలతో గోడ కట్టినట్టు మెరుస్తోంది తోవ. మంచుకొండల నడుమ చిన్ని బాట యిది. చాల అరుదుగా యీ దారంట మనుష్యులు నడుస్తారంట. కానీ నాకెవ్వరు కనిపించలేదు. వొక్కదాన్ని నడుస్తూనే వున్నాను. అప్పుడప్పుడు వాహనాల్లో మనుష్యులు వెళుతుంటారంట. నడుస్తుంటే దరిదాపుల్లో యెవ్వరు లేరనే తలంపు వొక్క క్షణం బాప్ రే అనిపించింది. యీ మధ్య యిలాంటి సందర్భాలు యెదురైనప్పుడు ‘గ్రావిటి’ సినిమా గుర్తోస్తోంది. ఆ వొంటరితనం ముందు యిదేమంత పెద్ద విషయమనిపిస్తుంది.

ఆ సినిమాని యెంత అద్భుతంగా ఫీల్ అయ్యానో. అంతకంటే అద్భుతంగా అనిపించిందేంటంటే ఆమె స్పేస్ నుంచి రేడియోలో భూమి మీద వున్న వాళ్ళని కాంటాక్ట్ చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు వో అపరిచిత…
పూర్తిగా »

ఇట్లు మీ…

ఇట్లు మీ…

 చిన్నప్పుడు స్నేహితులతో ఆడుకొన్న దాగుడుమూతల్లా యిప్పుడు నీతో నాతో యీ సెల్‌ఫోన్‌ కన్నెక్టివిటి అంటూ భలే దాగుడు    మూతలాడుతోందిలే. ప్రస్తుతానికి నీతో ఫోన్‌లో మాట్లాడాలనే ఆలోచనని విరమించి యీ మెయిల్‌ రాస్తున్నాను.

యీ వుదయం యిక్కడికొచ్చాం.

మా సినిమాటోగ్రాఫర్‌ యిక్కడ వెలుగుని చూస్తు ముచ్చటపడుతూ యీ కాంతిని యిలానే తన పనితనంతో పట్టుకోవాలని కలలు కంటున్నాడు.  యెలాంటి మూమెంట్స్‌ కంపోజ్‌ చెయ్యాలని కొరియోగ్రాఫర్‌, యెలాంటి కలర్‌ కాంబినేషన్స్‌ మరింత అందాన్ని యిస్తాయని కాస్ట్యూం డిజైనర్‌, యీ   చలికి జలుబు తెచ్చుకోకుండా మిరియాలపాలు యింకా యేమేమి యివ్వాలాని ఫుడ్‌ మేనేజర్‌ యిలా ప్రతి వొక్కరూ 360 డిగ్రీస్‌ ఆలోచిస్తున్నారనుకో. కొంత కాలంగా టీమ్‌ వర్క్‌ టీమ్‌…
పూర్తిగా »