పుస్తక పరిచయం

ఆర్తిగా లోలోన రగిలే హృదయాలాపనే కవితాసమయాలుగా.. ‘ఒక రాత్రి మరొక రాత్రి’

ఆర్తిగా లోలోన రగిలే హృదయాలాపనే కవితాసమయాలుగా.. ‘ఒక రాత్రి మరొక రాత్రి’

సృజన ఆధార మూలస్రావాల్లో తడిసిముద్దవుతున్నవాడు, నిదుర ఓడకు లంగరేసి, మెళుకువ తీరాలవె౦ట మాటల శకలాల్ని ఏరుకు౦టూ సుమధుర భావాలాపన ఆలపించే౦దుకు ఎరుకతో ఆలోచనా మునకలు తీస్తు౦టాడు. అన్వేషణ అన౦తమైనదని తెలుసు, తానూ దూకుడుగా ప్రవహి౦చే తన భావనా నది లోతైనదనీ తెలుసు, దాన్ని ఈదడం భారమనీ తెలుసు. అయినా తనను గాయపరచిన సామాజిక సందర్భాల్ని దాచివు౦చిన జ్ఞాపకాల మూటల్ని విప్పుకు౦టూ ఒకటొకటిగా బయటకు తీసి నిమురుతూ ఆప్యాయ౦గా హృదయానికి హత్తుకుని ఏడ్చే పసిబిడ్డను లాలి౦చినట్టు లాలిస్తూ కన్నీటిని మునివేళ్ళతో తుడుస్తూ దారితప్పి తచ్చాడే కురుచ భావాలను సవరి౦చుకు౦టూ ఆత్మలో మొలకెత్తే సలుపును పసిగట్టి కాపాడుకోవలసిన దుఃఖాల పట్ల స్పృహ కలిగి కాల౦ స్థితిని పి౦డి అక్షరాల్లో…
పూర్తిగా »

దాసరి సుబ్రమణ్యం కథలు

దాసరి సుబ్రమణ్యం కథలు

అజ్ఞాత రచయితగా ఎన్నో పిల్లల నవలలు రాసి చందమామలో కొడవటిగంటి కుటుంబరావు గారికి కుడిభుజంలా వ్యవహరిస్తూ యాభై ఏళ్ళ పాటు ఒక చిన్న ఇంట్లో అద్దెకి ఉంటూ దాదాపు అనామకంగా మరణించిన వ్యక్తి దాసరి సుబ్రమణ్యం గారు. ‘ఇన్ని దశాబ్దాలపాటు ఒకే ఇంట్లో అద్దెకి ఉన్నది భూమండలం మీద నేనొక్కడినేనేమో!’ అనేవారుట.

ఈయన రాసిన పెద్దల కథల సంకలనాన్ని వాహినీ బుక్ ట్రస్ట్ వారు 2011 లో దాసరి సుబ్రమణ్యం కథలు అనే పేరుతో తెచ్చారు. కథల్లో వాక్య నిర్మాణం చాలా చోట్ల అచ్చు గుద్దినట్లు కొ.కు గారిదే. ఇంక కథనం, శైలి, జాన్రా మాత్రం చాలా వరకు కొమ్మూరి సాంబశివరావు (ఉవ్వి) గారిదీ, కొంతవరకు…
పూర్తిగా »

మొయిద శ్రీనివాసరావు కవిత్వం

మొయిద శ్రీనివాసరావు కవిత్వం

ఈనాటి కవికి తను నిలబడ్డ నేల మీద జరుగుతున్న సకల విధ్వంసాలనూ ప్రశ్నిస్తూ.. కవిత్వం చేయడం గొప్ప బాధ్యతాయుతమైన పని. ఆ ఎరుక వున్న కవి తనకు తెలిసిన తన స్థానికత పునాధి మీద నిలబడి తన మట్టిని గురించి కలవరిస్తాడు. ఆవేదన పడతాడు.
పూర్తిగా »