వాళ్లేమన్నారంటే!

ప్రశ్నించు

ప్రశ్నించు

భావనల గురించి చెప్పాలంటే- నీ అంతరంగాన్ని సాంద్రంగా, ఉత్తేజంగా మలిచే భావాలన్నీ స్వచ్ఛమైనవే. నీలోని ఒక పార్శ్వాన్ని చేజిక్కించుకుని నిన్ను కకావికలు చేసినవి మాత్రం మలినమైన అనుభూతులు. ఆమాటకొస్తే పసితనపు ఆలోచన్లన్నీ మంచివే. నీ శక్తియుక్తులన్నిటినీ మించి నిన్ను ఉదాత్తంగా తీర్చిదిద్దగలిగే ఆలోచన ఏదైనా సరైనదే. ఏ విషయంలోనైనా గాఢత ఉండటం చాలా అవసరం. అది ఒళ్లెరగని మత్తులో మురికిలో ముంచే గాఢత కాదు. రక్తంలో పూర్తిగా కలిసిపోయి, అటుకొసన ఏముందో తెలిసిన ఆనందం, చిక్కగా ఉండాల్సిందే. అర్ధమౌతుంది కదా?

ఇకపోతే- సందేహించడం, ప్రశ్నించడం చాలా మంచి లక్షణాలు, ఐతే ప్రశ్నించడం ఎలానో సరిగ్గా నేర్చుకోవాలి. నీ ప్రశ్న ఏమిటో నువ్వు ముందు అర్ధం…
పూర్తిగా »

నేనూ – బోర్హెస్

జూన్ 2016


నేను అలా వీధుల్లోంచి నడుస్తూ, ఎంట్రన్స్ హాల్ ఆర్చివైపో, గేటుమీది ఇనపకమ్మీలనూ చూసేందుకో అలవాటుగా ఒక్క క్షణం ఆగినప్పుడు నాకు తటస్తపడే వ్యక్తి బోర్హెస్. నాకు ముందుగా ఇతను ఉత్తరాల ద్వారా తెలుసు, ఒక్కోసారి అతనిపేరు అధ్యాపకులు, ఆత్మ కథకుల జాబితాల్లో కనిపిస్తూ ఉంటుంది.

ఇక నా సంగతా ?నాకేమో ఇసుక గడియారాలు, మాపులు, పద్దెనిమిదో శతాబ్దపు టైపోగ్రఫీ, కాఫీ రుచి, స్టీవెన్సన్ వచనం, ఇటువంటివంటే చాలా ఇష్టం. వీటిల్లో కొన్ని అతనికి కూడా నచ్చుతాయేమో, కానీ వాటన్నిటినీ మహా గొప్పగా తన పాత్రల వర్ణనకోసం మాత్రమే వాడుకోవడం నన్ను కష్టపెడుతుంది. ఐనాసరే, మేము పరస్పరం విరుద్ధమైన వ్యక్తులమని అంటే అది అతిశయోక్తి అనే అంటాను.…
పూర్తిగా »