ఆడియో

ప్రళయ కావేరి కథలు

ఏప్రిల్ 2017


ప్రళయ కావేరి కథలు


టైమ్ మెషీన్ లో కూర్చుని గతకాలంలోని ఒక ప్రాంతాన్ని సందర్శించ గలగడం ఫాంటసీ. కొన్ని పుస్తకాలు ఈ ఫాంటసీని దాదాపుగా నిజం చేయగలుగతాయి. స.వెం.రమేశ్ గారి ‘ప్రళయ కావేరి కథలు’ అలాంటి ఒక టైమ్ మెషీన్. అన్నట్టు, ఈ కథల్లో ఫాంటసీలకీ సముచితమైన చోటుంది.

సాంకేతికత, ప్రభుత, వ్యాపార శక్తుల ప్రయోగ ప్రమేయాలు… కారణాలేవైనా, సంఘజీవనం అంతకంతకూ వేగంగా మార్పులు చెందుతూ పోతోంది. ఒక మార్పును అర్థం చేసుకుని సర్దుబాటయేలోగా మరిన్ని కొత్త మార్పుల రాకతో నేటి సమాజపు జీవితాలలో కుదురు లేకుండా పోతోంది. ఈ కుదురు లేకపోవడమనేది బాగా తక్కువగా వున్న కాలంనాటి ఒక సమాజాన్ని మెల్ల మెల్లగా తెరలు తీసి…
పూర్తిగా »