కవిత్వం

శూన్యంలోంచి శూన్యంలోకి

ఫిబ్రవరి 2016

దయపు లెక్కంటే
సున్నాతో సున్నాను భాగించడమే కదూ?
ఏమిలేనితనం నుంచి
మైలు రాయిని తలుచుకుంటూ
మేను ముందుకు వంచడమే.

నిద్ర లేని రాత్రులను
కాల సముద్రంలో కలుపుతూ
తూరుపు నుంచి ప్రవహించడమే కదా!

***

మిట్ట మధ్యాహ్నపు వేళ
బంధాల బంతాటలో
ఒక ఆనంద క్షణంలోనూ వదలని వేలాదిలక్ష్యాలలో
ఒకే ఒక్క జీవనం
మనకోసం మిగిలిపోవడం
ఆశ్చర్యం కాక మరేమి?

***

పడమటి పరదాపైన
ఎగుడు దిగుడుల జీవన రేఖను
ఊహల ఊలు దారాలతో ముడి వేస్తూ
మనో మందిర ద్వారాలకి తోరణాలు కట్టడం
నిజంగా పునర్జన్మే.

***

చివరి చీకటి మలుపులో
శూన్యంలోంచి… శూన్యంలోకి చేరిపొయే
నిస్సంకోచ ప్రయాణమేగా జీవితం.5 Responses to శూన్యంలోంచి శూన్యంలోకి

 1. రామకృష్ణ
  February 2, 2016 at 4:01 am

  చాలా బాగుంది. అవును ఉదయపు లెక్కంటే సున్నాతో సున్నాను భాగించడమే.

  • విలాసాగరం రవీందర్
   February 4, 2016 at 1:42 pm

   ధన్యవాదాలు రామకృష్ణ గారు

 2. Mahamood
  February 9, 2016 at 3:51 pm

  అర్థాలను వెదుక్కునే యాతనలో పాఠకుణ్ణి సులువుగా అర్థం చేసుకుని మంచి అనుభూతి కవిత రాసినందుకు అభినందనలు

 3. విలాసాగరం రవీందర్
  March 1, 2016 at 9:01 pm

  ధన్యవాదాలు మహమూద్ గారు

 4. rama moorthy
  March 3, 2016 at 7:17 pm

  చాల బాగుంది సార్, మీ కవిత సున్నా ను సున్నా తో బాగిస్తే కూడా ఒకటి వస్తుంది అదే ఈ జీవిత ప్రయాణం చాల బాగుంది …..

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)