ఆకులు రాలుతున్నశబ్దం.
గాలి కూడా నిశ్చలంగా.
చెట్టూ, వాగూ నిర్వికారంగా.
నడుస్తుంటే పాదాల క్రింద ఆకులు
మెత్తబడుతూ…
గాలి కూడా నిశ్చలంగా.
చెట్టూ, వాగూ నిర్వికారంగా.
నడుస్తుంటే పాదాల క్రింద ఆకులు
మెత్తబడుతూ…
మబ్బుల అసందర్భపు హడావిడిని
హత్తుకున్ననీలంలో ఒత్తిగిలి
కలతపడి, అర మూసిన కన్నులతో
గమనిస్తూనే వుంది ఆకాశం
నిర్వేదంగా…
గొలుసుతో కట్టబడిన స్థంభాల్లా పాదాలు.
మెల్లగా ఈడ్చుకుంటూ, నడుస్తూ వుంటే
మది తలుపు తెరుచుకుని ఒక
జ్ఞాపకం, బయటకు
హఠాత్తుగా…
దుఃఖపు చారికలను విదుల్చుకుంటూ
రెక్కలు మొల్చుకొచ్చిన
స్వాతంత్ర్యంలా…
నా నుంచి విడివడి
దూరంగా…
నేలపై హఠాత్తుగా ఆగి నా వంక
బెదురుగా చూస్తూ పరిగెత్తిందో ఉడత పిల్ల
దూరంగా తీతువు పిట్ట అరుపు -
ఏదో, రేపటి రహస్యం చెబుతున్నట్లో,
దాచినట్లో!
దిక్కు తోచని దిక్కుగా పయనిస్తూ నేను
చుక్కలే చుక్కానిగా
ఒడ్డు దొరకని వైశాల్యం లోకి
గమ్యానికి గమ్యం వెతుక్కుంటూ
తెలియని చీకట్లు
పొగలా కమ్ముకుంటూ
నా నుంచి విడివడుతూ…
నా లోపలికి.
ఎప్పటిలా
ఇలా…
బాగుంది కవిత రావు బండి గారు
ప్రోత్సాహానికి ధన్యవాదాలు
విలాసాగరం రవీందర్ గారు…
వేరి నైస్
baagundi
సుహాస్, అవినాష్ …