‘ ఎన్.ఎమ్ రావు బండి ’ రచనలు

ఎందుకు నాకిలా?

ఆకులు రాలుతున్నశబ్దం.
గాలి కూడా నిశ్చలంగా.
చెట్టూ, వాగూ నిర్వికారంగా.
నడుస్తుంటే పాదాల క్రింద ఆకులు
మెత్తబడుతూ…

మబ్బుల అసందర్భపు హడావిడిని
హత్తుకున్ననీలంలో ఒత్తిగిలి
కలతపడి, అర మూసిన కన్నులతో
గమనిస్తూనే వుంది ఆకాశం
నిర్వేదంగా…

గొలుసుతో కట్టబడిన స్థంభాల్లా పాదాలు.
మెల్లగా ఈడ్చుకుంటూ, నడుస్తూ వుంటే
మది తలుపు తెరుచుకుని ఒక
జ్ఞాపకం, బయటకు
హఠాత్తుగా…
దుఃఖపు చారికలను విదుల్చుకుంటూ
రెక్కలు మొల్చుకొచ్చిన
స్వాతంత్ర్యంలా…

నా నుంచి విడివడి
దూరంగా…

నేలపై హఠాత్తుగా ఆగి నా వంక
బెదురుగా చూస్తూ…
పూర్తిగా »