కవిత్వం

తిరుగు ప్రయాణం

మే 2016

రిక్షావాడు లాగలేకపోతున్నాడు
నేనూ, నా ఊపిరీ
రిక్షాలో…

గోడ మొహం అటు తిప్పుకుంది
ఎప్పటిలాగే
ఈసారి తప్పకుండా వస్తానంటే నమ్మటం లేదు!

సూట్కేస్ నిండుగా ఉంది
సున్నుండలూ, చేగోడీలూ…
ఆశీస్సులూ…
అమ్మ నేనిచ్చిన ఉచిత సలహాల్ని కూడా సర్దేసింది.

గట్టిగా ఊపిరి పీల్చుకుని మళ్ళీ బయలుదేరా…
ఉన్న బెలూన్లోనుంచి గాలి తీసి ఇంకో బెలూన్లో ఊపిరులూదాలని…
ఎంతటి వ్యర్థ ప్రయత్నం!?

నింగిలో శాటిలైట్ దీనంగా చూస్తోంది…
ఎగిరినప్పుడున్న సరదా ఇప్పుడు లేదు
ఎందుకు ఎగిరానో దానికి కూడా తెలీదు…
ఇప్పుడు భూమిని చూస్తూ ప్రదక్షిణలే మిగిలాయి.

*7 Responses to తిరుగు ప్రయాణం

 1. Pavan
  May 1, 2016 at 7:02 am

  Nice bro

  • Aravind Chamarti
   May 1, 2016 at 5:53 pm

   Thank you… This is my first ever published article and you are the first to drop a comment.

 2. Sarat
  May 1, 2016 at 7:44 pm

  నైస్ వన్ Aravind

 3. వనజ తాతినేని
  May 4, 2016 at 9:45 am

  బావుంది. మరింత ప్రయత్నం చేస్తూ ఉండండి .

 4. Aravind Chamarti
  May 8, 2016 at 6:59 pm

  నా మొదటి కవిత అచ్చయ్యింది. కవితావేశం కట్టలు తెంచుకుంది. గర్వం కళ్ళు నిరాడంబరం నెత్తెక్కి కూర్చున్నాయ్. ఏవిటో ఆరడుగులకన్న ఎత్తున్నవే కనిపిస్థున్నాయ్. అరగంట నుంచి ఎవరైనా కామెంట్ చేస్తారేమో అని వెబ్సైటు లో కాచుకు కుర్చున్నా. ఇంకా ఊపిరి బిగబట్టలేక ఒదిలేసా . అప్పుడు కనిపించాయ్ మిగిలినవాళ్ళ కధలూ కవితలూ…. హిహిహి…. తలదులుపుకుని నిరాడంబరం మళ్ళీ ముందుకొచ్చి నిల్చుంది.

  • కె. మమత
   May 10, 2016 at 7:38 pm

   This is so sweet :) :) – ఈ కామెంట్ చూస్తూ ఎంతసేపు చిర్వవ్వుకుంటూ కూర్చున్నానో .

   “గోడ మొహం అటు తిప్పుకుంది
   ఎప్పటిలాగే
   ఈసారి తప్పకుండా వస్తానంటే నమ్మటం లేదు!”

   మొదటి కవిత బాగుంది అరవింద్. కంగ్రాట్స్!!! waiting for more poems from you.

 5. Aravind Chamarti
  May 20, 2016 at 4:41 am

  థాంక్ యు మమత గారు

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)