కులమంతగూడి
ఆత్మీయంగా అల్లుకొని
కట్టసుఖం మాట్లాడుకునే తావు.
పంచాతయ్యి
మాట మాట పెర్గి
ఎడమొకం, పెడమొకం
పెట్టుకున్నోళ్ళనేకం చేసే రేవు.
నేల మీద పట్ట పర్శి
శిన్న, పెద్ద తేడాలేక
సకిలం-ముకిలం బెట్టుకొని
బావా తీస్కుంటాన
మావా తీస్కుంటాన
కులమా తీస్కుంటాన
అన్న భోజనం మంత్రం జెప్పందే
ముద్ద నోట్లెకుబోదు.
పడ్సు పోరన్నుండి
పండు ముసలాయిన దాక
బంతిల కూసోని
లచ్చింశారు జుర్రుతాంటే…
నా సామిరంగా…
పర్వాన్నం తిన్నంత సంబ్రమైతది.
వర్సైనోళ్ళు పరాష్కమాడి
మారర్సుకుంటాంటే…
ఏం జెప్పాలె…
పాయిరానికే కడ్పునిండుతది.
యిత్తారాకుల పుల్ల
గొంతులిర్కి సరంబడ్తె
నాల్గుజేతులు నెత్తిసర్శి నీళ్ళందిత్తై
నల్బై గొంతులు సరాయిస్తై.
యిత్తారి మల్సి
శెయ్యి కడ్గుతాంటే
పబ్బోజనం మల్లెప్పుడొత్తదోనని
పానం తండ్లాడుతది.
wonderful
Telangana language is used more creatively in your పోయెమ్
బంతిబువ్వ మస్త్ వడ్డించినవ్ అన్న
కృతజ్ఞతలు అన్నా..
బంతిబువ్వను తెలంగాణ యాసల మంచిగ దిన్పిచ్చివే
Tqs anna