‘ వడ్లకొండ దయాకర్ ’ రచనలు

కుడుముంటె పండుగంటడు

కుడుముంటె పండుగంటడు

వాడెమ్మటుంటె సాలు
ఇగం పట్టిన శేతులకు
శెగ తల్గినంత హాయిగుంటది.
ఎడార్లె ఊట శెలిమె
దొర్కినంత కమ్మగుంటది.
మండుటెండల
మర్రి శెట్టు కిందున్నంత సల్లగుంటది.
పూర్తిగా »

బంతిబువ్వ

ఏప్రిల్ 2017


బంతిబువ్వ

కులమంతగూడి
ఆత్మీయంగా అల్లుకొని
కట్టసుఖం మాట్లాడుకునే తావు.

పంచాతయ్యి
మాట మాట పెర్గి
ఎడమొకం, పెడమొకం
పెట్టుకున్నోళ్ళనేకం చేసే రేవు.

నేల మీద పట్ట పర్శి
శిన్న, పెద్ద తేడాలేక
సకిలం-ముకిలం బెట్టుకొని
బావా తీస్కుంటాన
మావా తీస్కుంటాన
కులమా తీస్కుంటాన
అన్న భోజనం మంత్రం జెప్పందే
ముద్ద నోట్లెకుబోదు.

పడ్సు పోరన్నుండి
పండు ముసలాయిన దాక
బంతిల కూసోని
లచ్చింశారు జుర్రుతాంటే…
నా సామిరంగా…
పర్వాన్నం తిన్నంత సంబ్రమైతది.

వర్సైనోళ్ళు పరాష్కమాడి

పూర్తిగా »