అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి
ఒక చోటుండాలి ,ఊరుండాలి
కనీసం ఒక మనిషైనా మిగిలుండాలి
మాటలన్నీ పగిలిపోయి ,కరిగిపోయి
అర్ధాలన్నీ చెదిరిపోయి,బెదిరిపోయి
భావాలన్నీ కనుమరుగైపోయినప్పుడు
మాటల్ని కొత్తగా నేర్చుకునేందుకు ఒక నెలవుండాలి
కోర్కెలు అంతరించి ,దేహం ఒట్టి పుల్లైనప్పుడు
ఊహలు అరిగిపోయి మనసు ఉత్తి డొల్లయినప్పుడు
దారులన్నీ మూసుకుపోయి చిమ్మచీకటి మాత్రమె మిగిలినప్పుడు
మళ్ళీ కొత్తగా మొలిచేందుకు
ఒక్క పలకరింపు చినుకైనా మిగిలుండాలి
గతంలోకి ,భవిష్యత్తులోకి లోలకమై వేలాడుతున్న వర్తమానంలో
లుంగీ బనీనును మోస్తున్న ఒకానొక ఆకారంలా కాక
నెలవారీ జీవితమై విసిగి వేసారిపోయే చెల్లింపుల బిల్లుల్లోంచి
అర్ధరహితంగా ముఖాలమీంచి జారే చిరునవ్వులలోంచి
వ్యూహాల ఉత్తి సందర్భాలలోంచి
నీవేప్పుడైనా ప్రవేశించగలిగే నీదనే నిజమైన జీవితం ఒకటుండాలి
కనీసం
గూటిలోకి దూరేముందు టపటపా కొట్టుకునే
పక్షి రెక్కల ఒడుపులా
జీవితాన్ని ఒడుపుగా చేరుకోగలగాలి
పారుతున్న నీళ్ళను చేతుల్తో కళ్ళిగొట్టి,తేర్చి దోసిళ్ళతో
నీళ్ళను నోటికందించి దాహం తీర్చుకున్నట్లు
మిగిలిన దాహంలోంచి దేహాన్ని సేదతీర్చాలి
చిప్పిల్లే చిల్లుల్లోంచి పిండి విసిరేసిన మైనపుముద్దలాంటి
తేనెపట్టు మీద చివరిగా విలపిస్తున్నతేనెటీగలాం
అవశేషమే నిజమైన ప్రాణవంతజీవితమన్నట్లు ఎదగాలి
నీలోకి ఇమిడిపోయి రగిలిపోయి నీకులా నువ్వు మిగిలిఉండేందుకు
ఎక్కడైనా ఒక చోటుండాలి ,ఊరుండాలి
కనీసం ఒక్క మనిషైనా మిగిలి ఉండాలి
Maanaveeyathanu sampadvantham chese sahaja pushpa soundaryamidi.
Fine
యాకూబ్ గారూ, ఎన్నో ముఖాలతో ముసుగులతో నడపవలసి వచ్చే / నడిపించే ఈ ఆధునిక మధ్యతరగతి జీవితంలో, అద్దంలో మన ముఖం చూసుకున్నప్పుడు కూడా అది మనదో అరువుదో పోల్చుకోలేని పరిస్థితి. అందుకే మనిషికి ఈ ఆత్మ వ్యధ…సాంత్వన లేకపోవడం… ఏదో కోల్పోయిన భావన. ఇతరుల్ని మెప్పించడానికి ఎన్నికోల్పోయినా, తనకోసం తనదగ్గర దాచుకోవలసింది ఏదో బాగా చెప్పారు. అభినందనలు.
కోర్కెలు అంతరించి ,దేహం ఒట్టి పుల్లైనప్పుడు
ఊహలు అరిగిపోయి మనసు ఉత్తి డొల్లయినప్పుడు
దారులన్నీ మూసుకుపోయి చిమ్మచీకటి మాత్రమె మిగిలినప్పుడు
మళ్ళీ కొత్తగా మొలిచేందుకు
ఒక్క పలకరింపు చినుకైనా మిగిలుండాలి
………. నెలవారీ జీవితమై విసిగి వేసారిపోయే చెల్లింపుల బిల్లుల్లోంచి
అర్ధరహితంగా ముఖాలమీంచి జారే చిరునవ్వులలోంచి
వ్యూహాల ఉత్తి సందర్భాలలోంచి
నీవేప్పుడైనా ప్రవేశించగలిగే నీదనే నిజమైన జీవితం ఒకటుండాలి.
నిత్య జీవితంలో అలిసిపోయిన ప్రతివొక్కరికీ ఈ కవిత ఒక ఉపశమనం.ఒక చందన లేపనం,ఒక మంచి నీటి చెలమ. కృతజ్ఞతలు యాకూబ్ గారూ!
bhavallo swachatha..vasthavakitha mari bhasha lo theekshnaatha.. entho bavundi..
పరాయీకరణ పరాకాష్టకు చేరినప్పుడు పలవరింతలు సహజమే.అది గుండె లోతుల్లోంచి తన్నుకొస్తది.అందుకే అద్భుత కవిత్వమైతది.
Very Good
“నీలోకి ఇమిడిపోయి రగిలిపోయి
నీకులా నువ్వు మిగిలిఉండేందుకు
ఎక్కడైనా ఒక చోటుండాలి ,ఊరుండాలి
కనీసం ఒక్క మనిషైనా మిగిలి ఉండాలి”
Beautiful….hats off 2 U
కవిత ప్రారంభమే అద్భుతంగా ఉంది యాకూబ్ గారు,ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెపుతోంది.అభినందనలు.
**కనీసం
గూటిలోకి దూరేముందు టపటపా కొట్టుకునే
పక్షి రెక్కల ఒడుపులా
జీవితాన్ని ఒడుపుగా చేరుకోగలగాలి**
I can see the bird and life.. complementing each other in every aspect. Every line and every word spoke volumes of our lives and emotions. Great canvass of words!!!!!!!!!!!
ఎప్పుడూ మీ కవితలు సాహితీ పాఠాలే నాకు యాకుబ్ జీ
జయశ్రీ నాయుడు గారు!
మీ స్పందనకు ధన్యవాదాలు
స్పందించిన వారికందరికీ ధన్యవాదాలు.
సర్, మిమ్ము మెచ్హుకొనె అర్హత ఉందా నాకు, అయినా సరె నా అభిమానాన్ని తెలుపుకొంటున్నాను, మీ కవిత చాలా బాగుంది.
Meraj Fathima ji!
Thank you Medam!