కాయితప్పడవ

ఇజాజత్

జనవరి 2013

గుల్జార్ అంటేనే పాటల వనమాలి. 1986లో విడుదలయిన ‘ఇజాజత్” అనే మరచిపోలేని సినిమాలో మరచిపోలేని పాట ఇది.

నేను నాతో తెచ్చుకోలేని జ్ఞాపకాలు కొన్ని నీకై వదిలేశాను ప్రియా, వాటిని పదిలపరుచుకో.

నా మేలిముసుగు మాటున వుండే సిగ్గును, నీ మది దొంతరల వెనకాలె వదిలేశా, దానిని అనునయించి నీ మదిగది దాటకుండా చూసుకో.

మన అబేధ్యమైన హ్రుదయాలు కన్న కలలన్నీ కలిపి అక్కడే వదిలేశా… వాటిని నీ కనురెప్పల మాటునే పదిలంగ దాచుకుంటావ? నీ అడుగుల మాటున వేసిన అందెల సందడి లో నా మావి చిగురుల వెండి పట్టీ  వొకతి ఆ కలల రహదారులలో పడిపోయింది, నీవు మరలి వెళ్ళి దానిని పదిలపరచవా?

మనం గడిపిన వెన్నెల రాథ్రులలొ నీ స్పర్శకి ఆవిరైన నా స్వేద బిందువులు తారలని తలపిస్తూ నీ చెంపలనంటాయి…వాటన్నిటిని కూడదీసి, ఆకాశాన పెర్చవూ?! నీ యెసస్సు ని ప్రథిబింబించే నా నుదిటి నెలవంక అక్కదే బల్లమీద బరువుగ ఎదురు చూస్తోంది, దానిథొ నీ హ్రుదయాకాసాన్ని అలంకరించవ ప్రియా!

ఆక్కడే గుమ్మం దగ్గర నే పలకలేని ఊసులన్నిటిని కూర్చి తడారి పొయిన మాటలతో రాసిన ఒక ఉత్తరం ఉండాలి, నీ ముసి ముసి నవ్వుల నీళ్ళు కాస్త చిలకరించి దానికి ఊపిరి పోస్తావా?

నీ ప్రేమ జడిలో నే తడిసిన వాన ఇంకా అక్కడ కురుస్తూనే వుంటుంది, ఆ జడి రాథ్రి కి నా పసుపు పచ్హని చీరతో వెలుగు నింపెయ్యి.

నీ సాంగత్యంలో నే పలికిన మధురమైన ప్రియ సంభాషణలు ఇంకా అక్కడే జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి, వాటిని జాగ్రత్తగా  నీ మది అరలలో దాచెయ్యి…”

 

(అనునాదం:  శ్రీనివాస శర్మ)3 Responses to ఇజాజత్

 1. buchireddy
  December 26, 2012 at 4:39 am

  jesus–super sharma garu

 2. RAVI
  January 5, 2013 at 3:48 am

  ఒకె గొదుగులొ మనిద్దరం తడుస్తూ…. Great

 3. G. K. Ananthasuresh
  January 26, 2013 at 3:09 am

  Nice words and good translation.

  I too like this song so much that I had translated this into Telugu so that it can be sung to the same tune. But I do not know how to write in Telugu script on this page. I have a pdf file of the Telugu script and can share it with anyone who wants to read it.

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)