కవిత్వం

నేను – మా ఆవిడ – కొన్ని ద్విపదులు

22-మార్చి-2013

కొట్టి, తిట్టి హత్తుకొని ఏడుస్తుంది,
మా ఆవిడ మహా ఖిలాడి..

***

బంధాలన్నీ సమాంతరాలే,
అన్నిట్ని ఖండించే తిర్యగ్రేఖ, మా ఆవిడ..

***

సమాజానికి తానో అబల,..
నాకే, మా ఆవిడ మహాబల..

***

ఒక్కమాట – పది సమాధానాలు,
అందులో స్పెషలిస్ట్,.మా ఆవిడ,.

***

కణకణమంటూ గరిటె చప్పుళ్లు,
వంటిట్లో మా ఆవిడ ఆడధీర,.

***

ఉరుముల మెరుపుల వడగండ్లవానే,
కన్నెర్రచేస్తే, మా ఆవిడ,.