కవిత్వం

నీలిచెట్టు

సెప్టెంబర్ 2017

లుపెరగని సుదూర
అధోయానంలో
రాటుదేలిన నీ చూపు
కొమ్మల సందుల్లోంచి
ఆకుల పళ్లేల మీద
వడ్డించే విందును
కడుపారా ఆరగిస్తుంది లోకం
తొలి, కడ పంక్తులుండవు
ప్రతి కంటా నిండుకొలువై
తోవ దీపమవుతుంది
అందరినీ తాకుతూ
అనంత ప్రవాహమవుతుంది
ఉదయాస్తమయాల నడుమ
ఊయలూగుతుంది
ఊతకర్రను గిరాటేసి
ఎగిరి గంతేస్తాము
చుక్కల పక్షులు ఖాళీ చేసిన
నీలిచెట్టువు

రెప్పవాల్చి
నల్లంచు తెల్లచీరలో
తనువారబోసుకుంటావు
చల్లని చేతులతో
అక్కున చేర్చుకుంటావు.



మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)