కవిత్వం

ది అబ్సెషన్

అక్టోబర్ 2017

‘యూ మిస్స్డ్ మీ’ ?!

—-

‘లాట్ .. లాట్.. లాట్ అండ్ లాట్’ !

‘యూ మీనిట్ ?’

అలవాటుగా తిరిగే వీధి మలుపులో ఎప్పటివో ప్రశ్నలు అదృశ్యంగా వెంటాడటం

తిరిగొచ్చే దారిలో ప్రపంచమంతా మాయమై, నను వెతుక్కుంటూ నీ చూపులు శూన్యం నింపుకోవడం

రాత్రివేళ ఎక్కణ్ణుంచో, నీ మౌనాన్నంతా రట్టు చేస్తూ.. ‘లగ్ తా నహీ హై దిల్ మెరా..’ దూరంగా వినిపించడం -

అంతేగా,’లాట్’ అంటే!

ఇంటి వసారా మొత్తం పరుచుకొని నీకోసమే ఎదురుచూస్తున్న నా జ్ఞాపకపు నిశ్శబ్దమేగా

విసురుగా పడేసిన తాళాలేవో ఎన్ని కాలాలకూ మౌనంగా నిన్ను ప్రశ్నిస్తుండటమేగా

నే మాటలు చేరనంత దూరమైనపుడు.. నా తలపులన్నీ నీ సాయంత్రపు వ్యసనమవడమేగా -

‘లాట్’ అంటే?’

ఆతృతగా వెదికే కళ్ళు

ఊపిరి సలపనివ్వని ఊసులు

క్షణ క్షణానికీ భారమయే కాలం

నా పిలుపుకోసం వెతుక్కునే హృదయం-

మొత్తంగా,   ‘లాట్’ అంటే -

‘అయామ్ యువర్  అబ్సెషన్’  అని నీకు తెలుస్తుండటమేగా!

 
 
Painting Credit: Waiting by Gabriele Bitter