కవిత్వం

సఖి

డిసెంబర్ 2017

ప్పక మెలిపెట్టే నొప్పై
తన్నుకొచ్చే వ్యధలేవో

ఎవరో పిలిచినట్టు
స్థంభించిపోయిన స్మృతులేవో

నీరెెండలో సాగిపోయిన నీడలేవో!

వడ్రంగిపిట్ట రెక్కల రంగుల్లో పొంచివున్న అవే ప్రశ్నలు
మెట్లపైనెవరివో అల్లరి పరుగులు
వివరాలడక్కనే వీచే పిల్లగాలులు
ఉసిరిటాకులపై ఎప్పటివో వేళ్ళగుర్తులు
అర్థం కాని ఆరాటాలు

తొలకరి జల్లై నేలను తాకిన రొదలు

నీలో పోగొట్టుకున్న నా ఉనికి!!