ఆ చిటారు కొమ్మన కూర్చొనున్నాయి కొన్ని క్షణాలు
ఎప్పుడు దిగొచ్చానో తెలీదు, ఎలా ఎక్కానో గుర్తు రావడమూ లేదు
దోసిళ్ళలెక్కన ఏవేవో పళ్ళను తెంపిన ఆనవాళ్ళు
నోటి నిండా ఇంకా తియ్యని జ్ఞాపకాలు
లెక్కపెట్టకుండా పంచుకున్న పూవుల్లాంటి రోజులు
కళ్ళలో ఊరే కన్నీటి సాక్షిగా.
పోట్లాడుకోవడం కొత్తేమీ కాదు మనకు.
ఏ దారం బరువుకు ఏ హృదయం తెగుతుందోనని చేతి వ్రేళ్ళను తెగ్గోసుకున్నా,
ఏ రెండు మూడు రక్తపు బొట్లో రాలక మాననేలేదు, ఊడల్లాంటివేమో కొన్ని మాటలు
మాను మీద చెక్కుకున్న ప్రేమికుల పేర్లలా మిగిలిపోయాయి, మరికొన్ని గాయాలూ.
రాలిపోతే మళ్ళీ చిగురించే ఆకువు కావుగా నువ్వు – పిట్టలు తొడిగిన పసిడి రెక్కవు
వాకిలంతా చొచ్చుకుపోయిన మొండి వేళ్ళేమో నావీనూ
ఖాళీగా మిగలక తప్పుతుందా మరి, కలిసి కట్టుకున్న ఆ కలల గూళ్ళన్నీ.
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్