అప్పటికి తను ఇంకా రాలేదు
వస్తుందనీ నమ్మకమూ లేదు
గడ్డ కట్టిపోయిన ఈ సమయం చివర
చెట్టు కొన్ని మంచు బిందువుల్ని అలా రాలుస్తుంది
ఎంతకాలమో ఇలా ఈ ఆకాశాన్ని మోస్తూ తిరగడం
నేనైతే పదాల్ని కాస్త మెత్తగానే రాశాను
అర్ధం కాని కవిత్వమో
ఇనుప గుగ్గిళ్ళలాంటి పదబంధాలో వాడలేదు
బహుశా తనమీద రాయడం వలనే ఈ ఉలుకు కాబోలు
పూర్తిగా రాశాక మాత్రం
నన్ను అన్నం ముద్ద చేసి
నాకే తినిపించిన
అమ్మ చేతులకిచ్చాను
ఆమెకి చదువు రాదు
నేలని ప్రేమగా సాకుతున్న
నాన్న జేబులో కాసేపలా పెట్టితీశాను
కాస్తైనా ఆ కాగితపు మడతల్లో దాగిన భయం
పోయి ధైర్యం పూనుతుందని
వాళ్ళేకదా ఈ రెండు మొక్కల్ని అంటుకట్టాల్సింది
గాలి తాను పాడుతున్న పాటను ఆపడం లేదు
చేతిలో ప్రేమలేఖ
మనసులో దిగులు
గులాబీ ఒక్కటి వేల వేల కిలోల బరువై పోతూ
నేను మోయలేనంతగా మారిపోతుంది
దూరంగా రైలు వస్తున్న చప్పుడు
ఒక పసిపాప నా భయం చూసి నవ్వుతుంది
పచ్చ జండా ఊపుతూ రైలు కదిలిపోయింది
చేతులనిండా కారుతున్న తేనేని
ఆత్రంగా తిన్నంతటి తీపి కలని
ఒక్క వాట్సప్ మెస్సెజ్ తరిమేస్తుంది
కాలం కొత్త చొక్కా తొడుక్కుంది
తను ఇప్పుడు ఆన్లైన్లోకి వస్తుందట
నేనైన ప్రేమలేఖ నన్ను దీనంగా చూస్తుంది
థ్యాంక్యూ … ఎడిటర్స్
ప్రేమికుడి తపన బాగ చిత్రించారు. కంగ్రాట్స్!
ధన్యవాదాలు స్వాతి సాయి యాకసిరి గారు
చాలబావుంది అన్న… కంగ్రాట్స్…