ఆ ముఖంలో రుచి కనిపించక
నాలుకతో నిర్మించిన నిర్లిప్త నిరీక్షణే
అప్పటి వో కాలపు సాయింత్రపు
సూర్యశబ్దాల ఆఖరి నిశ్శబ్దజిహ్వకై
స్వప్నాసనాలు నేర్పిస్తుంటే
యెప్పటి వూపిరి యెముకల్లోకో
పర్వత పాదాలు తడవటానికి
అనుసరించే ఆలోచనలు
క్షీణత
పక్షవాతపు క్షీణత
వాసనల క్షీణత
తాబేటి తలలో నీడల్లేని మాటల వంతెన
నేలను తాకే కల
గుడ్డి నవ్వు
మోకరిల్లాలి జ్ఞాపకాల కాళ్ళపై
యెవరి ఆత్మో నీహత్య చేసేయ్
బ్లేడుతో పరాయి అద్దాన్ని కోసేయ్
లో అద్దాల లంగాల్ని లాగి పారేయ్
ప్రేమాంగాల్లో దూరిపో
గాల్లోని గాలిని గ్లాసులోకి గిరాటేయ్
ప్రాంతీయ అంధత్వం కెవ్వు కేక
నోట్లో ఆ అంగాలు తిరగకపోతే తప్పిపోతావ్
అనుభవాలు ఆలోచనల్ని నిరూపించేలోపే
కళ్ళకి నాలుకలు విషాన్ని తాపుతాయ్
నిధనము లభించు ఎల్లవేళలా
good one naidoo..
మోకరిల్లాలి జ్ఞాపకాల కాళ్ళపై
యెవరి ఆత్మో నీహత్య చేసేయ్
బ్లేడుతో పరాయి అద్దాన్ని కోసేయ్
లో అద్దాల లంగాల్ని లాగి పారేయ్……….nice lines…high profile poem with a great depth!!
thank you ajay and c v suresh gaaru
good one…
పదాలతో ఆడుకోవడం నాయుడు కవిత్వం
thank you anil and kaasula gaaru.
ఎప్పుడో మీ బ్లాగులొ చదివిన కొన్ని కవితలూ వాటి గాఢతా ఇంకా ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి.ఇప్పుడు మరొకటి చేరింది.హత్తుకునే కవిత. అభినందనలు
thank you vaasudev gaaru
naidu kavita adbhutamgaa undi taabeti talao needaluleni maatalu
నాయుడూ….
నీ కవిత్వం రింగులు తిరుగుతూ వొచ్చి, ఏం జరుగుతోందో గమనించేలోగా ఎత్తుకెల్లిపోయే సుడిగాలి…
సరే గానీ,
‘ప్రాంతీయ అంధత్వం కెవ్వు కేక’ అంటే ఏంటి మిత్రమా?
koduri vijaykumar gaaru, telangana ani ariche vallantha andhatwamlo vunnarani andhra naayudi gaari ardham…thanx naidu…
thank you ram gaaru and kodoori.
idi telugu kavitEnaa anipinchEtatlugaa vundi.
chalaa chaaalaa baavundi.
thanks Naidoo