‘ ఎం. ఎస్. నాయుడు ’ రచనలు

వేరే అద్దంలో

వేలాడే వాక్యాల నిబంధన అనుకునేలోపే
పదాభినయశిల్పాల్లో ఏకాంతర ఏకాంతం

నేత్రసర్పపుష్పంలో
తలతో తలవని తడిమెలికల్లో
తోలుతీగల తాండవం

వేరేవొక గాలి
వేరే అద్దంలో
లోలోపల చూసి ఏమి తాకిందో

మరో పదమేలేని అరచేతుల్తో వున్నా
బొమ్మల మనసు గారడీలో నవ్వెక్కడ

నిశ్చేష్ట ఇష్టంలో తడవని మరుపులెన్నో
పరోక్షస్పర్శభ్రమలో

నిజాలు చెప్పలేని మాటలే కావాలి
గంతులేసే నీడల్లో


పూర్తిగా »

నిశ్శబ్దజిహ్వ

22-ఫిబ్రవరి-2013


ఆ ముఖంలో రుచి కనిపించక
నాలుకతో నిర్మించిన నిర్లిప్త నిరీక్షణే
అప్పటి వో కాలపు సాయింత్రపు
సూర్యశబ్దాల ఆఖరి నిశ్శబ్దజిహ్వకై
స్వప్నాసనాలు నేర్పిస్తుంటే
యెప్పటి వూపిరి యెముకల్లోకో
పర్వత పాదాలు తడవటానికి
అనుసరించే ఆలోచనలు

క్షీణత
పక్షవాతపు క్షీణత
వాసనల క్షీణత

తాబేటి తలలో నీడల్లేని మాటల వంతెన
నేలను తాకే కల
గుడ్డి నవ్వు

మోకరిల్లాలి జ్ఞాపకాల కాళ్ళపై
యెవరి ఆత్మో నీహత్య చేసేయ్
బ్లేడుతో పరాయి అద్దాన్ని కోసేయ్
లో అద్దాల లంగాల్ని లాగి పారేయ్
ప్రేమాంగాల్లో దూరిపో
గాల్లోని…
పూర్తిగా »