మారుతున్న కాలంలొ
నమ్ముతున్న దారుల్లొ
ఎదురొచ్చి నన్నోటేసుకుని భుజం చరిచినోడా
పిడికిట్లో అగ్నికణం రగిల్చి
కన్నుల్లో చమురునింపుకొచ్చి
దీప్తి చేసి దారి చూపినోడా..
దుర్మార్గున్ని పొలిమేరల్లోకి తరిమికొట్టి
మా స్వేచ్చాయుత నిద్రల్ని ప్రేమించిన ప్రేమికుడా
లాటిన్ అమెరికాకు మా తల్లంపాడుకు తేడాలేదన్న నిజం
మా గుణంలో నింపినోడా!
నీది వెనుజులానో, బొలీవియానో, చివరాఖరకు పెరూనో
నాకేమెరుక??
నువ్వు నిలబడ్డ సిద్దాంతం,
నిప్పులు చెరిగిన మాటలు,
గుండెకింద ధైర్యం
సామ్యవాద ఆకాంక్ష
నీ ఎర్రటి చొక్కా..
చాలు వీరుడా నాకు చాలు..!!
నువ్వు నాటిన విత్తులు
మొలకెత్తటం, తలకెత్తటం ఖాయం
ఎర్రపూలు ప్రపంచదారుల్ని ముంచెత్తటమంతిమం!
నువ్వు రాలినచోట నేనుండకపోవచ్చు
అంతిమయాత్రలో పాల్గొనకపోవచ్చు
కానీ నాలో నీ పోరాటముంది
గుంటనక్కకు వాతపెట్టే తెగువవుంది!!
రాకాసి కలల్ని కల్లలు చేసే ధైర్యముంది
వాడిప్పుడు ఇటు వైపే వస్తాడు
నీ విప్లవ వారసుల చేతుల్లో చస్తాడు.
నీ మరణం నింపిన మా కళ్ళనీళ్ళ అస్పష్టతల్లో…
నిద్రించు వీరుడా
నువ్వు నిద్రించు..!
సైమన్ బొలీవర్ లా నువ్వూ పిడికిళ్ళ తలపాంపులపై నిద్రించు
నీ 58ఏళ్ళ మెలుకువల్ని అర్దం చెసుకున్నాం
ఇక మెలుకువ మా పని
ఆయుధం,
లక్ష్యం
అంతకుమించి సిద్దాంతం..!!!
(అమెరికా సింహస్వప్నం ఛావెజ్ కు అశ్రునివాళి)
Babi nee, nityam amerika paadalu naakuthuu samrajyawadam vyathirekamgaa matlade, raathalu raase vaalla chempa chellu manipinchaav. Kaneesam okka samthapa sabha kuda jarapani pirikipandala, dhourbhagyapu telugu desham lo puttinanduku siggu padthunna Chaavez..nee shatruvu amerika ku baanisalai thama arts nu jnaanaanni kalalanu amerikaku ammukuntunna maa telugu varandari tharapuna kshamapalanu koruthunna comrade…Chavez zindabad..
నిద్రించు వీరుడా
నువ్వు నిద్రించు..!
సైమన్ బొలీవర్ లా నువ్వూ పిడికిళ్ళ తలపాంపులపై నిద్రించు
నీ 58ఏళ్ళ మెలుకువల్ని అర్దం చెసుకున్నాం
ఇక మెలుకువ మా పని
ఆయుధం,…అవును ఇవ్వాళ్ళ వెనుజుల,బొలివియా ,చిలి చూపుతున్న దారుల్లో క్యూబా కు అండగా పెద్దన్నాను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలె.సమకాలిన రాజకీయాల పట్ల స్పందన అవసరం.
కవిత్వాన్ని ఎప్పుడు ఎలా వాడాలో ఎందుకు వాడాలో బాగా తెలిసిన వాడివి బాబీ …..అద్భుతంగా ..రాసావు సోదరా …