కవిత్వం

విధేయత

29-మార్చి-2013

తచ్చాడుతున్నది
నీడలో నిజాలో
మిత్రులో శత్రువులో
కుక్క మొరుగుతుంది

కరుస్తదనే భయం లేదు
కరవడానికి అవకాశం లేదు
గొలుసుతో బంధించి ఉంది శునకం

జాడ కదలాడుతుంటే
కుక్క మౌనంగా అనుమానంతో
ఒగరుస్తూ తేరిపారచూస్తుంది

చెవులు రిక్కించి
ఎదురు బొదురుగా చూసుకుంటూ
కొడుతడేమో అనుకుంటే గ్రామ సింహం
మనిషి కరుస్తుందేమోననుకుంటాడు

భైరవుడు మొరుగుతూనే ఉంది
మన లోపలి లోకాన్ని
జాగరుకతలోకి మేల్కొల్పుతూ కూడా

విధేయ అవిధేయతల
విశ్వాస అవిశ్వాసాల మధ్యనున్న
సన్నని రేఖను
కలుపుతూ … చెరుపుతూ…
మచ్చమచ్చల తెల్లకుక్క

ఎప్పుడూ
కార్య సానుకూల సాధన కోసం
యజమాని తోకూపుతూ
కీర్తిస్తుండాడు



2 Responses to విధేయత

  1. March 29, 2013 at 4:49 pm

    భైరవుడు మొరుగుతూనే వుంది ” అనొచ్చ? మొరుగుతూనే వున్నాడు అనాలా?

  2. April 1, 2013 at 4:07 pm

    బాగుంది,..ముంగింపు వాక్యాలు పైవాటి భావన్ని కొనసాగించలేకపోయాయేమో అనిపించింది,.

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)