కవిత్వం

వర్షమా! వర్షమా!

02-మే-2013

ఉషోదయ వేళ నీ కళ్లు రెండు తాటిమళ్లు
చంద్రుణ్ణి సాగనంపుతున్న రెండు ముంగిళ్లు
నీకళ్లు నవ్వితే పల్లవిస్తాయి ద్రాక్షపందిళ్లు
కాంతులు నర్తిస్తాయి నదిలో చంద్రుళ్లలా
తొలిసంధ్య వేళ తెడ్డు కదిపినట్లు
అట్టడుగున తారకలు చిందులాడుతున్నట్లు
తాళవృక్షాలు వర్షం తాగడం నేను వింటున్నట్లు
ఇరాక్ పల్లెల మూల్గులూ
బహిష్కృతులు సింధు శాఖపై
పెనుగాలులతోఉరుములతో పోరాడుతూ చేసే
గానం ‘వర్షం,వర్షం’ నేను వింటున్నట్లు
ఇరాక్ లో క్షామం
పంటకోతవేళ బొంతకాకులకూ మిడతలకూ
ఆహారంగా వెదజల్లిన ధాన్యం
పొలాల్లో ధాన్యం గింజల్నీ ,రాళ్ళని పిండి చేస్తున్న మర చుట్టూ
జనం మొర ‘వర్షం,వర్షం’…
కరువు లేని వసంతం గడవని ఇరాక్
‘వర్షం,వర్షం’…
ఎరుపుదో పసుపుదో విరియని మొగ్గ ప్రతి వానచుక్కలో
కూడూ బట్టా లేని వారి ప్రతి కన్నీటిబొట్టూ
బానిసజీవుల ప్రతి రక్తపుబొట్టు
నవాధరాలు నిరీక్షించే చిరునవ్వు
పసికందు నోటిలో గులాబీ పాలపీక
రేపటి జవసత్వపు జగత్తులో జీవనప్రదాత వర్షం
పచ్చగా ఇరాక్ పెరుగుతుంది వర్షపాతంలో

మూలం: బదర్ షకీల్ అస్సయ్యాబ్
అనువాదం: వాధూలసమీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)