హృదయాంతరంగంలోకి
నిన్నెత్తుకోంది,నీతో మొత్తుకోంది,నిన్నత్తుకోంది
ఏ గమ్యమూ చేరలేను! జీవనసారాన్ని స్పృశించలేను!
నీతో విసిగివేసారి
దిగాలుపడి కూర్చునప్పుడల్లా
మనసును మేఘావృతం చేసి
కన్నీటి బిందువై వడుస్తూ,…మనోభారాన్నిదింపుతూ…
నీకు నాకు వో అలౌకిక బంధాన్ని పెనవేస్తుంటావ్!
నిన్ను వదిలించుకోవాలని విదిలించుకుంటుటానా!
ఆనందం రాలిపోతుంటుందేగాని
నీవు మాత్రం వెన్నంటే వుంటుంటావ్!
ఆత్మజులనుకున్న వారు
ఎందరు వదిలిపెట్టి వెళ్లినా
నీవు మాత్రం విడిచిపెట్టని వో సహచరివై
నా కూడా నడుస్తుంటావ్! నాలోకి వడుస్తుంటావ్.
నమ్మకం దిశగా వో అనంత విశ్వాసాన్ని నిర్మించుకునే
వో ఆలంబనంగా నీలో నన్ను పుటమేసుకోంది,
శుద్ది చేసుకోంది, అహంకారంలోంచి
నన్ను నేను వడగట్టుకోగలనా ?!
నన్నావహించి నాలో విస్తరించిన
ఎన్ని అనర్థాలు, ఎన్ని అపార్థాలు
నీలో నాని చీకి పోతాయో! చినిగిపోతాయో!
ఎన్నెన్ని అనుభవాలు గుణపాఠాలై వ్రేళ్ళాడుతుంటాయో!
ఓ నా దుఃఖమా !
నాలో నీవు జన్మిస్తు మరణిస్తూ
నన్ను దిగులు చిత్తడిని చేస్తూ…పురా గాయానివవుతూ….
అప్పుడప్పుడూ వో ఆనందహేలకు తెరలేపుతు
ఎప్పటికి కొత్తగాని దానవు
లోమురికిని ఉతికే డిటర్జెంటువు!
బహుశః నీవు లేని జీవితం శూన్యమేనేమో!!
బాగుంది కొండ్రెడ్డి
బాగుందండి
వేంకటేశ్వర రెడ్డి గారు,
పోయెమ్ బాగుంది.
Baagundi Reddy garu.wish to see more poems.
బాగుందండి…కానీ edit చేస్తే మరింత బాగుండేది మీ కవిత. ‘డిటర్జెంటువు’ పదానికి బదులు ఇంకేదయినా ఉపయోగించాల్సింది!
మంచి కవిత.అందులోనూ మరీ బాగున్న భాగం
నిన్ను వదిలించుకోవాలని విదిలించుకుంటుటానా!
ఆనందం రాలిపోతుంటుందేగాని
నీవు మాత్రం వెన్నంటే వుంటుంటావ్!
ఆత్మజులనుకున్న వారు
ఎందరు వదిలిపెట్టి వెళ్లినా
నీవు మాత్రం విడిచిపెట్టని వో సహచరివై
నా కూడా నడుస్తుంటావ్! నాలోకి వడుస్తుంటావ్.మరీ బాగుంది