కవిత్వం

నీ జ్ఞాపకం

17-మే-2013

ప్రయాణంలో ఎక్కడ జారవిడుచుకున్నానో నీ జ్ఞాపకాన్ని

నాతో నువ్వు లేవన్నమాటే తెలియనంతగా
ఎలా…ఎలా?
నిన్నే మర్చిపోయేంతగా
ఏం జరిగిపోయిందీ జీవితంలో ?
నిన్ను అట్టడుగు పొరల్లోకి నెట్టేసేటన్ని
అనుభవాలు సంపాదించానా?

నీ జతలేని క్షణమే లేదుగా నా గతంలో!

సర్ధి చెప్పుకుంటున్నానులే మనసుకి
నా తప్పేం లేదు…
కాలం అన్నిటినీ మాయం చేస్తుంది
గాయాన్నైనా….జ్ఞాపకాన్నైనా!



9 Responses to నీ జ్ఞాపకం

  1. జాన్ హైడ్ కనుమూరి
    May 17, 2013 at 10:00 am

    జ్ఞాపకాల్ని తడిమిచూసుకుంటూ వచ్చారన్నమాట అక్షరాల కుప్పనూర్పుళ్ళ మధ్యకి

    శుభాకాంక్షలు

  2. May 17, 2013 at 10:02 am

    కవిత్వాన్ని కూడా మాయచేద్దామనుకుందేమో,..కుదరలేదేమో బహుశా,..ఇక్కడ రాధిక గారి కవిత ఒకటి వికసించింది,.చాలా కాలం తరువాత మీ కవిత,..బాగుందండి,.

  3. May 17, 2013 at 6:14 pm

    ‘కాలం అన్నిటినీ మాయం చేస్తుంది
    గాయాన్నైనా….జ్ఞాపకాన్నైనా!”

    నిజమే, నిన్ను కూడా మాయం చేసిందిగా!!
    బావుంది, చాలా రోజుల తర్వాత నీ కవిత్వాన్ని చదవడం :)

  4. May 18, 2013 at 12:16 am

    జాన్ గారూ,భాస్కర్ గారూ,నిషీ థాంక్యూ అండి.

  5. THUMMALA DEVARAO
    May 18, 2013 at 12:45 am

    Prayanam lo enno magililu konni gnapakalu konni anubavalu ….konni marichi poyetivi konni badali salupetivi ….. manchi kavitha mistic ga undi

  6. May 19, 2013 at 9:56 pm

    ఎన్నాళ్లయిందో మీ కవిత చదివి!? మొత్తానికి ఇలా కనిపించారు…బాగుంది.
    “సర్ధి చెప్పుకుంటున్నానులే మనసుకి” ఆ వొక్క లైన్ చాలు ఇవాల్టికి..
    మళ్ళీ ఇన్నాళ్ళకి కనిపిస్తారు?

  7. May 19, 2013 at 9:56 pm

    సారీ. “ఎన్నాళ్ళకి?” కనిపిస్తారు?

  8. Seetha
    May 20, 2013 at 9:00 am

    మంచి కవిత…..

  9. May 24, 2013 at 2:07 am

    Tummala devarao గారూ,అఫ్సర్ గారూ,సీత గారూ కవిత బావుందన్నందుకు థాంక్స్.

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)