మబ్బుతునకల ఆఖరి చారికను అదృశ్యం చేస్తూ
చీకటి చిక్కపడుతుంది..
ఆకాశమల్లెలు ఒక్కొక్కటిగా విరబూస్తాయి
నాలుగు మాటలు చెప్పుకోడానికో
లేక తప్పిపోయిన కలల్ని వెదుక్కోడానికో!
కేరింతల సీతాకోకచిలుకల కలవరింతల్ని
గాజుల చేతుల కింద పొదవిపట్టేసి
నిశ్శబ్దాన్ని మృదువుగా పరిచేయాలి..
జ్ఞాపకాల శకలాలనీ.. సుదూర స్వప్నాలనీ
పగటి పాట్లనీ
వాటంతట వాటికి వదిలేసి
ఈ రాత్రిని జీవించాలని ఉంది!
నాలోకి నేను కాకుండా
నా నించి నేను దూరంగా..
నిశ్చలభయాల నిర్వికారాన్ని
ముక్కలుగా వేరుచేసి విసిరేస్తూ
తేలికై పోవాలి!
పగలంతా ఒద్దికగా కూర్చున్న ముగ్గు
ఉండుండి వీచేగాలికి
వళ్ళు విరుచుకుంటుంటే..
వాకిలి పొడవునా రాలిన పారిజాతాలతో
కాసేపు అక్షరాభ్యాసం చేసుకోవాలి!
మనస్థాపాల మసకతెరలని తప్పించి
అతన్ని ఐదునిమిషాలన్నా
చుంబించాలి…
ఈ నింపాది రాత్రిని పరిచయం చేయాలి!
వీచే నింగి కింద
గాలిని కోస్తున్న గడ్దిపువ్వులు…
అరచేతినంటిన ఆత్మీయపు స్పర్శ…
ఇదిగో.. ఇప్పుడే కొండెక్కిన దీపం వదిలిన వెచ్చదనం..
ఈ రాత్రికో భరోసా దొరికినట్లే!
గుప్పెడు వెలుగు ముఖాన్ని తట్టి లేపేలోగా
ఇక ఈ రాత్రిని పూర్తిగా జీవించాలి!!
మరో అద్భుత భావ విన్యాసం మీ నుంచి నిషిగంధగారూ. మీవాక్యాలు చదవటం ఓ మధురానుభూతి.
నిషిగంధ గారూ
ఈ కవిత చాలా రసవత్తరంగా ఉంది. ఆఖరి చరణాలు కావితాత్మని పరాకాష్ఠకి తీసుకెళ్ళాయి.
అభినందనలు.
వాకిలి పొడవునా రాలిన పారిజాతాలతో
కాసేపు అక్షరాభ్యాసం చేసుకోవాలి!
– ఇలాంటివి పాఠ్య అంశాలుగా చేర్చాలి. అప్పుడు గానీ ..పిల్లలకి ఎందుకు దేనికి పరిగేడుతున్నామో, ఏంటో అర్ధం కాదు .. గుప్పెడు వెలుగు ముఖాన్ని తట్టి లేపేలోగా
ఇక ఈ రాత్రిని పూర్తిగా జీవించాలి!!
పగలు జీవించాలంటే .. రాత్రి సజీవ స్పృహ కావాలి .. మంచి ఫీల్
నాలోకి నేను కాకుండా
నా నించి నేను దూరంగా..
—-ఇంత positiveగా చెప్పొచ్చా !!! చాలా బాగుంది కిరణ్ గారు
పదాల పొందికలో ఒదిగున్న సంగీతం మీకు పట్టుబడుతోంది. సంతోషం. అభినందనలు.
భలే ఉంది!
“నాలోకి నేను కాకుండా
నా నించి నేను దూరంగా..
నిశ్చలభయాల నిర్వికారాన్ని
ముక్కలుగా వేరుచేసి విసిరేస్తూ
తేలికై పోవాలి!”
కాష్ ఐసా హోతా
బావుంది నిషీ.
Adbhutamga undi Nishi. A very wonderful feeling.
వాసుదేవ్ గారు, మూర్తి గారు, సాయి పద్మ గారు, శ్రీనివాస్ గారు, నారాయణస్వామి గారు, మధుర, పద్మవల్లి, ప్రసూన — మీ అందరి ప్రోత్సాహానికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు..
excellent
Thank you, Trishna gaaru..
Gud one Nishi !!!
ఇది చదువుతూన్నంత సేపు…నా చుట్టుపక్కల గాలి మంద్రంగా వీస్తోంది:-)
Thank you, Shwetha
))) ఇస్మాయిల్ గారూ.. కవిత్వం చదువుతూ చదువుతూ మీక్కూడా కవి లక్షణాలు వచ్చేస్తున్నాయండీ!
ధన్యవాదాలు.
Wah wah