‘ నిషిగంధ ’ రచనలు

కవిత్వం- ధ్వని, ప్రతిధ్వని

నవంబర్ 2017


కవిత్వం- ధ్వని, ప్రతిధ్వని

మనందరికీ కేవలం మనవే అనిపించే కొన్ని అభిరుచులూ, అనుభవాలూ, స్థలాలూ ఉంటాయి. అవి అర్థవంతమైనవీ, వ్యక్తిగతమైనవీనూ. ఒకప్పుడు వీటిని రాయొచ్చు, అందరితో పంచుకోవచ్చు అనే అవగాహన బహుతక్కువగా ఉండేది. నాకైతే దేశం విడిచి వచ్చిన తర్వాత కానీ నా అభిరుచులకు నేనివ్వాల్సిన విలువ అర్థం కాలేదు. స్వదేశంలో ఉన్నంతకాలం చదవడం మీద ఉన్న ఆసక్తి రాయడం మీద ఉన్నట్టు అస్సలు గుర్తులేదు. అసలు రాయడం అనేది మానవాతీతశక్తులు ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలిగేది అని నమ్మిన రోజులవి!

చిన్నప్పటి నించీ నేనూ పుస్తకాలు బానే చదివేదాన్ని… చందమామ, బాలమిత్ర, శరత్ సాహిత్యం, ఆంధ్రజ్యోతి, అంధ్రభూమిలో బొమ్మదేవర నాగకుమారి సీరియల్స్, యండమూరి నవల్సూ… ఇలా… సరిగ్గా ఇదే…
పూర్తిగా »

కహా సే ఆయే బద్‌రా…

ఫిబ్రవరి 2015


కహా సే ఆయే బద్‌రా…

అద్భుతాలన్నీ తాత్కాలికాలేనని నమ్ముతాను కానీ అవి పునరావృతమూ అని ఖచ్చితంగా ఎవరూ చెప్పరెందుకనీ!? ఝూటా హీ తో సహీ, ఒక భరోసానెందుకివ్వరూ!?!?

నాకు తెలుసు.. ఈపాటికే వచ్చి ఉంటావనీ, గుప్పెడు గింజలు పోగేసి పెట్టి, అలసటగా ముడుచుకుని కూర్చుని ఉంటావనీ తెలుసు.. ముఖ్యంగా, నే వచ్చేదీ లేదీ తెలియడం నీకు చాలా ముఖ్యమని కూడా తెలుసు.
కానీ… ఇంకా ఏదో తెలియంది మిగిలుందనే చూస్తున్నా! వచ్చే ముందు ఇక్కడ దిగుడు బావిలో వెదుక్కోవాల్సింది ఇంకేదీ లేదని ఇంకోసారి ఖచ్చితంగా తేల్చుకోక తప్పదు!

అసలు ఎప్పుడైనా అనుకున్నామా!? ఇంత అందమైన ఊరిలో మనిద్దరం కలిసి ఒక ముచ్చటైన ఇల్లు కట్టుకుంటామని!

పూర్తిగా »

వలస పక్షి

ఆగస్ట్ 2014


వలస పక్షి

కొన్నిసార్లు ఏదనీ చెప్పడానికేముండదు..

వద్దనుకున్నవో.. వదిలేసుకున్నవో
పాత బంధాలు
కొత్త బెంగలై
లోపల్లోపల పేరుకోకముందే
తటాలున విదిలించేసుకున్నా
అకారణ దిగులేదో
ఇంటిచూరు పట్టుకుని వేళ్ళాడే మధ్యాహ్నపుటెండలా
ఉత్తినే వేధిస్తుంటుంది..

పచ్చపూలవనాల్లో
అలక్ష్యంగా ఎగిరీ..
ఆగి ఆగి నవ్వుతున్న నక్షత్రాల ఆకాశాన్ని
భుజాన వేసుకుని..
ఎప్పటికీ తిరిగి రాని రెండు ఝాముల కోసం
ఒక వలస పక్షిలా
మళ్ళీ వెళ్ళి వెదుక్కున్నా
పలకరించేది
గోడలు కూలిన రహస్యగృహమే!

ఎందుకో మాట్లాడలేక.. మాట్లాడి ఏమవ్వనూ లేక
మౌనంగానే తేలికవ్వాలంటే..

ఎవరినీ చేరని కలలా

పూర్తిగా »

అమ్మలు

ఏప్రిల్ 2014


అమ్మలు

సగం వేసి వదిలేసిన బొమ్మల్లోకి
తోక లేని ఉడుతలూ.. పేరు తెలియని పువ్వులూ
వచ్చి చేరేలోపలే
రంగులన్నీ గోడలతోనూ.. గుమ్మాలతోనూ
గుసగుసలు మొదలు పెడతాయి..

అలసి అదమరిచిన
చిందరవందర ఇంద్రధనస్సు
మేలుకున్నప్పుడే
ఒక అంతఃపురంలో తెల్లవారుతుంది..
స్తబ్దత తెరలన్నీ
హడావిడిగా పక్కకి జరపబడతాయి..

శృతి చేయబడుతున్న పదాలు కొన్ని
పాల చినుకుల్లో మునకలేస్తుండగానే
చెలికత్తె రామచిలుకలు
వాలతాయి..
నాలుగ్గోడల మధ్యనో
ఉద్యానవనం పరుచుకుంటుంది..

పరుగుల చివురాకు స్పర్శలూ
నవ్వుల కోయిల పాటలతో
ఉదయాలగుండా
వసంతం వీస్తుంటుంది!

కాగితపు…
పూర్తిగా »

జయభేరి మొదటి భాగం – కవితలు

జయభేరి మొదటి భాగం – కవితలు

రేపటి తరానికి.. -స్వాతీ శ్రీపాద

రైనా బీతి జాయే …!! – సాయి పద్మ

ఈ ఒక్క రాత్రి గడవనీ -రామినేని తులసి

దేహ ఉగాది -సాయి పద్మ

ప్రవాస కోకిల – నాగరాజు రామస్వామి

ఎన్నెన్ని వసంతాలో.. ఇంకెన్నెన్ని అందాలో… -క్రాంతికుమార్ మలినేని

వసంతుడొస్తాడు…తెల్లారగనే! -శ్రీనివాస్ వాసుదేవ్

అమ్మలు – నిషిగంధ

రంజకం (అష్ట పది) – ఎలనాగ

 


పూర్తిగా »

జయభేరి మూడవ భాగం – కవిత్వం నాకేమిస్తోంది?

జయభేరి మూడవ భాగం – కవిత్వం నాకేమిస్తోంది?

కవిత్వం నాకేమిస్తోంది? 

కవి మిత్రులకు నమస్కారం!

వాకిలి ఆహ్వానాన్ని మన్నించి జయభేరి కవి సమ్మేళనంలో చేరిన కవులందరికీ స్వాగతం.

అదాటున ఎదో గుర్తొచ్చి నవ్వుకుంటాం. కొన్నిటిని గుర్తుతెచ్చుకునీ మరీ ఏడుస్తాం. ఏమిస్తుందని ఒక జ్ఞాపకాన్ని పురిటి నొప్పులుపడుతూ మళ్ళీ మళ్ళీ కంటాం? బాధ, సంతోషం, ఒక వ్యక్తావ్యక్త ప్రేలాపన? అసలు ఎందుకు ఆలోచిస్తాం? ఈ ఆలోచనా గాలానికి ఎప్పుడూ పాత జ్ఞాపకాలే ఎందుకు చిక్కుకుంటాయి? ఎందుకు అనుభూతుల్లోకి వెళ్లి కావాలనే తప్పిపోతుంటాం? అసలు ఎందుకు ఆలోచిస్తాం అన్నదానికి సమాధానం దొరికితే, ఆ సమాధానమే “కవిత్వం నాకేమిస్తోంది?” అనే ప్రశ్నకు సమాధానం అవుతుందా?

అసలు కవిత్వం నాకేమిస్తోంది? నేను కవిత్వం ఎందుకు రాస్తున్నా? తెలియని ప్రపంచపు లోతుల్ని…
పూర్తిగా »

ఈ రాత్రి…

05-జూలై-2013


మబ్బుతునకల ఆఖరి చారికను అదృశ్యం చేస్తూ
చీకటి చిక్కపడుతుంది..
ఆకాశమల్లెలు ఒక్కొక్కటిగా విరబూస్తాయి
నాలుగు మాటలు చెప్పుకోడానికో
లేక తప్పిపోయిన కలల్ని వెదుక్కోడానికో!

కేరింతల సీతాకోకచిలుకల కలవరింతల్ని
గాజుల చేతుల కింద పొదవిపట్టేసి
నిశ్శబ్దాన్ని మృదువుగా పరిచేయాలి..

జ్ఞాపకాల శకలాలనీ.. సుదూర స్వప్నాలనీ
పగటి పాట్లనీ
వాటంతట వాటికి వదిలేసి
ఈ రాత్రిని జీవించాలని ఉంది!

నాలోకి నేను కాకుండా
నా నించి నేను దూరంగా..
నిశ్చలభయాల నిర్వికారాన్ని
ముక్కలుగా వేరుచేసి విసిరేస్తూ
తేలికై పోవాలి!

పగలంతా ఒద్దికగా కూర్చున్న ముగ్గు
ఉండుండి వీచేగాలికి

పూర్తిగా »

ఆ ఆప్తక్షణాల యధాతధ అనువాదమే ఈ ఇంద్రగంటి కవిత!

15-ఫిబ్రవరి-2013


ఆ ఆప్తక్షణాల యధాతధ అనువాదమే ఈ ఇంద్రగంటి కవిత!

జీవన ప్రస్థానంలో ఏదో ఒక మజిలీ దగ్గర ఆగి వెనక్కి తిరిగిచూసుకుంటే ఎన్నో సంతోషాలు.. ఆవేశాలు.. అవస్థలు.. ప్రేమలూ.. వేదనలూనూ!

అవి అనుభవించేప్పుడు మనఃస్థితి ఎలా ఉన్నా దాటేశాక మాత్రం ప్రతి జ్ఞాపకమో పరిమళాన్ని సంతరించుకుంటుంది. ఆ పరిమళాలే ప్రేరణగా మనల్ని స్పృశించే కవిత ఇది. “స్వప్నం నా ఊత కర్ర.. నిశ్శబ్దం నా గమ్యం..” అని చెప్పుకునే శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి అనుభూతి గీతాల సంపుటిలోదీ కవిత. చదువుతున్నంతసేపూ అనుభూతి నించి ఆలోచనకూ.. ఆలోచన నించి అనుభూతికీ సాగే అంతర్లోక భావనా సంద్రమొకటి అద్భుతమైన పదచిత్రాల ద్వారా సాకారమౌతుంది. అప్పట్లో కవిత్వం పేరిట కొందరు ప్రాధాన్యం ఇచ్చే విషయాలకు (ఛందస్సు, ప్రాస) భిన్నంగా…
పూర్తిగా »

మనో విహంగాలు

జనవరి 2013


వసంతాలూ.. వెన్నెల నీడలూ.. వెదురు తోటలూ
అన్నిటినీ ఒకేసారి కావలించుకోవాలని
గూడువదిలిన సీతాకోకచిలకల్లా హడావిడి పడుతుంటాయి…

స్వప్నసంచారాల నిదురవేళల్లో
కొబ్బరాకుల చివుళ్ళపై
రేపటి కలల్ని పేరుస్తుంటాయి..

పొగమంచుని తాకిన
పొద్దుటెండలోని మెత్తదనం…

నల్లని వర్షపు రాత్రులలో
తడితడిగా మునకలేసిన మోహాలు…

తుంపులు తుంపుల జ్ఞాపకాలూ…
గాఢమైన దిగుళ్ళూ…

మనసు పట్టక.. దేహపు అంచుల్ని దాటేసి
నింపాదిగా ప్రవహించే భావాలెన్నో!
తెల్సిన అక్షరాలు మాత్రం గుప్పెడే!!

అనుభూతులన్నిటికీ అస్థిత్వాన్నిఅద్దుతుంటాయి…
అసంఖ్యాక చిత్రాలనెన్నిటినో ఆవిష్కరిస్తాయి!

కానీ..
నైరాశ్యపు క్షణాలు కొన్ని
అస్సలిష్టంలేని అగరుబత్తి ధూపంలా
చుట్టుముట్టునప్పుడు మాత్రం…..

శీతాకాలపు సాయంకాలాలలోపూర్తిగా »