కవిత్వం

కొన్ని కన్నీళ్ళు

26-జూలై-2013

ఇప్పుడు కాస్తంత దు:ఖం కావాలి!
పుడమితల్లి పేగు కొసను తెగ్గొట్టే ఉమ్మనీటి ఉప్పెన రావాలి.
పైరు పసికందై గుప్పిట్లో మొలకనవ్వులు చిందాలి.
వాడిన వాగుల్లో నీటివాలు అలలపూలు పూయాలి.
మబ్బుగొడుగు పట్టి ఆకాశం వేడెక్కిన పరిగ వెన్ను తట్టాలి.
వానవిల్లు ఎక్కుపెట్టి మేఘం
నది నడుము(మ)ను గిలిగింతలు పెట్టాలి.
కడగళ్ళ వాకిళ్ళను కడిగేసి వడగళ్ళ ముగ్గులెట్టాలి.
కాలిలో ముల్లుకి కంట ఒలికే నీరులా
కర్షకుడి బాధకి కారుమబ్బు కన్నీళ్ళు చిలకాలి.
ఇప్పుడు దు:ఖాశ్రువు పాశుపతాస్త్రమై
కరువుసీమ లో కలిమి గంగను వెలికి తీయాలి.
ఇప్పుడు మరింత  దు:ఖం కావాలి!


అనుదీప్ వయసు 15 సంవత్సరాలు. నెల్లూరు జిల్లా కొండదిబ్బలో పదవ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ నాన్న గారి ప్రోత్సాహంతో తెలుగు నేర్చుకుంటూ, తెలుగు సాహిత్యం మీద ఇష్టం పెంచుకుంటున్నాడు.5 Responses to కొన్ని కన్నీళ్ళు

 1. RaviChandra
  July 26, 2013 at 5:59 pm

  Hi అనుదీప్ ,,
  పుడమితల్లి పేగు కొసను తెగ్గొట్టే ఉమ్మనీటి ఉప్పెన రావాలి.,,వాడిన వాగుల్లో నీటివాలు అలలపూలు పూయాలి..
  కర్షకుడి బాధకి కారుమబ్బు కన్నీళ్ళు చిలకాలి.
  ఇప్పుడు దు:ఖాశ్రువు పాశుపతాస్త్రమై
  కరువుసీమ లో కలిమి గంగను వెలికి తీయాలి.;;;;;;;;;;;;;;;;
  నీ వయసుకు నువ్వు చాలా అద్బుతంగా రాశావు,కళ్ళు జిగేల్ అనేలా రాశావు, నీ లో వున్న కవితామ తల్లిని నిద్రపోనీయకు,
  నీకు మరింత ప్రోత్సాహం కావాలంటె మీ నాన్న గారి బుజాల్ని కుదిపెయ్,,,,

 2. Praveen
  August 1, 2013 at 10:27 pm

  Simply superb buddy! :-)

 3. August 2, 2013 at 3:52 am

  డియర్ అనుదీప్,

  దుఃఖం విలువను ఇంత పసి వయసులో ఎలా లెక్క గట్టగలిగావు? ఎలా పోల్చుకోగలిగావు?

  వానవిల్లు ఎక్కుపెట్టి మేఘం
  నది నడుము(మ)ను గిలిగింతలు పెట్టాలి.
  కడగళ్ళ వాకిళ్ళను కడిగేసి వడగళ్ళ ముగ్గులెట్టాలి.____________

  ఇంత చక్కని తెలుగుని ఎలా రంగరించావోయి ?

  పాల బుగ్గల పసి వాడివే ఇంత చక్కగా రాసావంటే , మరింత ఎదిగాక కవిత్వపు విందులేగా మాకు?

  Congratulations to you and your father.

 4. Thirupalu
  August 8, 2013 at 9:16 pm

  ‘ అనుదీప్ !
  నువ్వు కవివి అవుతావని నేను చెప్పను కాని, …..నువ్వు కవివి ఎప్పుడో అయ్యావు ” పుడమితల్లి పేగు కొసను తెగ్గొట్టే ఉమ్మనీటి ఉప్పెన ను అడుగుతున్నపుడు. కర్షకుడి బాధకి కారుమబ్బు కన్నీళ్ళు చిలికినప్పుడు.

 5. November 23, 2013 at 1:18 pm

  NUVVU VEMANANU MINCHINA KAVIVI

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)